AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయవంతమైన పీఎస్‌ఎల్‌వీ-సీ46 ప్రయోగం

శ్రీహరికోట: ఇస్రో మరోసారి తన సత్తా చాటుకుంది. మరో చారిత్రాత్మక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ46 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. 615 కేజీల బరువున్న రీశాట్-2బీ… అత్యంత ఆధునిక రాడార్‌ ఇమేజింగ్‌ భూ పరిశీలనా ఉపగ్రహం. పీఎస్‌ఎల్‌వీ-సీ46 వాహక నౌక 557 కి.మీ ఎత్తులోని కక్షలో ప్రేవేశపెట్టడంతో.. పీఎస్‌ఎల్‌వీ-సీ46 […]

విజయవంతమైన పీఎస్‌ఎల్‌వీ-సీ46 ప్రయోగం
Ram Naramaneni
|

Updated on: May 22, 2019 | 7:08 AM

Share

శ్రీహరికోట: ఇస్రో మరోసారి తన సత్తా చాటుకుంది. మరో చారిత్రాత్మక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ46 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. 615 కేజీల బరువున్న రీశాట్-2బీ… అత్యంత ఆధునిక రాడార్‌ ఇమేజింగ్‌ భూ పరిశీలనా ఉపగ్రహం. పీఎస్‌ఎల్‌వీ-సీ46 వాహక నౌక 557 కి.మీ ఎత్తులోని కక్షలో ప్రేవేశపెట్టడంతో.. పీఎస్‌ఎల్‌వీ-సీ46 ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగానికి  కౌంట్‌డౌన్‌‌ను మంగళవారం ఉదయం 4.30 గంటలకు ప్రారంభమైంది. 25 గంటల కౌంట్‌డౌన్‌ ముగిసిన అనంతరం బుధవారం ఉదయం 5.30 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ46 నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ బయలుదేరిన తర్వాత 15.29 నిమిషాలకు ఉపగ్రహం విడిపోయింది. అత్యంత ఆధునిక రాడార్‌ ఇమేజింగ్‌ భూపరిశీలన ఉపగ్రహమైన రీశాట్‌-2బీఆర్‌1 కాలపరిమితి ఐదేళ్లు. ఈ ఉపగ్రహం రక్షణశాఖకు అనేక రకాలుగా ఉపయోగపడనుంది. సరిహద్దుల్లో శత్రువుల కదలికలను ఈ ఉపగ్రహం సులువుగా గుర్తించేందుకు వీలుంది. అంతేకాక వ్యవసాయం, అటవీ రంగాల సమాచారంతో పాటు ప్రకృతి విపత్తుల్లో ఈ ఉపగ్రహం సాయపడనుంది. మొదటగా 2009లో రీశాట్‌ను ఇస్రో ప్రయోగించింది. 2012లో రీశాట్‌-1ను ప్రయోగించింది.

కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..
వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..
పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా
పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా
తెలంగాణలో మరో ఎన్నికలు.. త్వరలోనే షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికలు.. త్వరలోనే షెడ్యూల్..!
శ్రీలంక అమ్మాయిలకు వైజాగ్‎లో చుక్కలు చూపించడం పక్కా భయ్యా
శ్రీలంక అమ్మాయిలకు వైజాగ్‎లో చుక్కలు చూపించడం పక్కా భయ్యా
సిబిల్ స్కోర్ తక్కువుందా.. 500 నుంచి 750కి పెరగాలంటే ఇలా చేస్తే.
సిబిల్ స్కోర్ తక్కువుందా.. 500 నుంచి 750కి పెరగాలంటే ఇలా చేస్తే.