బిగ్ బాస్ హౌస్ లో లైంగిక వేధింపులా?

  కర్ణాటక:బిగ్ బాస్… వరల్డ్ వైడ్ గా విశేష ఆధరణ దక్కించుకుంటున్న రియాలిటీ షో. సౌత్ ఇండియాలో కూడా బిగ్ బాస్ క్రేజ్ బాగానే ఉంది. తెలుగు మరియు తమిళంలో ఇప్పటికే రెండు బిగ్ బాస్ సీజన్స్ పూర్తి అయ్యాయి. ఇక కన్నడంలో కూడా బిగ్ బాస్ షో సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ పై ఎన్నో వివాదాలు విమర్శలు వచ్చిన అవి షో పై అంత ఇంపాక్ట్ చూపలేదు. అయితే […]

బిగ్ బాస్ హౌస్ లో లైంగిక వేధింపులా?

కర్ణాటక:బిగ్ బాస్… వరల్డ్ వైడ్ గా విశేష ఆధరణ దక్కించుకుంటున్న రియాలిటీ షో. సౌత్ ఇండియాలో కూడా బిగ్ బాస్ క్రేజ్ బాగానే ఉంది. తెలుగు మరియు తమిళంలో ఇప్పటికే రెండు బిగ్ బాస్ సీజన్స్ పూర్తి అయ్యాయి. ఇక కన్నడంలో కూడా బిగ్ బాస్ షో సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ పై ఎన్నో వివాదాలు విమర్శలు వచ్చిన అవి షో పై అంత ఇంపాక్ట్ చూపలేదు.

అయితే సౌత్ ఇండియాలో మొదటిసారి ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ హౌస్ లో జరిగిన లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసింది .కన్నడ బిగ్ బాస్ పార్టిసిపెంట్ కవితా గౌడ మహిళ కమీషన్ కు మరో పార్టిసిమెంట్ అయిన ఆండ్రూపై ఫిర్యాదు ఇచ్చింది. సూపర్ హీరో వర్సెస్ సూపర్ విలన్ టాస్క్ లో భాగంగా తనను ఆండ్రూ లైంగికంగా వేదించాడని అతడి ప్రవర్తనతో నేను చాలా ఇబ్బంది పడ్డానంటూ కవితా గౌడ ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పటికే ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. రెండు రోజులు జరిగిన ఆ టాస్క్ లో యాండీ తనను పలుసార్లు లైంగికంగా వేదించాడని పేర్కొంది. ఈ విషయాన్ని బిగ్ బాస్ నిర్మాత గురుదాస్ శణైకి చెప్పినట్లుగా పేర్కొంది.

బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన వెంటనే కవితా ఫిర్యాదు చేసింది. మరో వైపు ఆండ్రూ ఈ విషయమై స్పందిస్తూ… బిగ్ బాస్ తర్వాత తాను కవితా గౌడను కలవలేదని ఆమె పోటీలో ఓడిపోవడంతో జీర్ణించుకోలేక ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తుందంటూ ఆండ్రూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Published On - 3:20 pm, Tue, 12 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu