జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే మా మూడు లక్షల మంది మద్దతు : రాష్ట్ర మరాఠా సమాజ్ తీర్మానం
ప్రస్తుతం జరుగుతోన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని రాష్ట్ర మరాఠా సమాజ్ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరాఠా
ప్రస్తుతం జరుగుతోన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని రాష్ట్ర మరాఠా సమాజ్ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరాఠా సమాజ్ కు చెందిన వారిలో దాదాపు మూడు లక్షల మంది ఓటర్లు ఉన్నారని సమాజ్ నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ మేరకు మరాఠా సమాజ్ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌ను మంగళవారం మినిస్టర్స్ క్వార్టర్స్ నివాసంలో కలిసి టీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్న తీర్మానం ప్రతిని అందజేశారు.
మరాఠా సమాజ్ సొంత ఖర్చులతో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థుల విజయం కోసం ఐదు వాహనాలను ఏర్పాటు చేసుకుని ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు మరాఠా సమాజ్ అధ్యక్షుడు ప్రకాష్ పాటిల్, ఉపాధ్యక్షుడు మదన్ జాదవ్, నివాస్ నిక్కం, కార్యదర్శి ఎల్.కే.షిండే వినోద్ కుమార్‌కు తెలిపారు.