ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. దంతెవాడ జిల్లాలోని కువాకుండా పోలీస్ పరిధిలోని చోటిగుండ్రా సర్పంచ్ లక్ష్మారామ్ గొంతుకోసి హత్య చేశారు. ఆ తరువాత ఘటనా స్థలంలో పోస్టర్లు, బ్యానర్లు విడిచి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు చోటిగుండ్రాకు చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ కూంబింగ్ కొనసాగుతోంది. కాగా ఈ ఘటనతో చోటిగుండ్రాలో విషాదఛాయలు అలుముకున్నాయి.