గణేష్ మండపాలకు అలర్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. భారీగా నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా తొలిసారి గణేష్ మండపాలకు […]

తెలుగు రాష్ట్రాల్లో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. భారీగా నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా తొలిసారి గణేష్ మండపాలకు కూడా వాతావరణ శాఖ సూచనలు చేసింది. ఇవాళ్టి నుంచి మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. బంగాళాఖాతం పశ్చిమ మధ్య ప్రాంతంలో 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు పేర్కొంది. అటు మధ్యప్రదేశ్‌పై 3.6 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం ఉంది. వీటి ప్రభావంతో తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.