పవన్ కు సంచయిత గజపతి విన్నపం

Pardhasaradhi Peri

Pardhasaradhi Peri |

Updated on: Sep 10, 2020 | 5:40 PM

మన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ సంచయిత గజపతి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పలు విజ్ణాపనలు చేశారు. మన్సాస్ ట్రస్ట్ కు హిందూయేతరులు నేతృత్వం వహిస్తున్నారంటూ పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలపై..

పవన్ కు సంచయిత గజపతి విన్నపం

మన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ సంచయిత గజపతి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పలు విజ్ణాపనలు చేశారు. మన్సాస్ ట్రస్ట్ కు హిందూయేతరులు నేతృత్వం వహిస్తున్నారంటూ పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలపై సంచయిత పూర్తి స్పష్టత నిచ్చే ప్రయత్నం చేశారు. నాలుగు వరుస ట్వీట్లలో వివరణ ఇచ్చారు. ‘పవన్ కల్యాణ్ గారు మాన్సాస్ కు హిందూయేతర వ్యక్తి అధినేతగా ఉన్నారని ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీరు చెప్పారు. ఈ సందర్భంగా కొన్ని నిజాలను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఆనంద గజపతిరాజు, ఉమా గజపతిల కూతురు నేను. నా తల్లిదండ్రులు ఇద్దరూ హిందువులే. నా తల్లి రమేశ్ అనే హిందూ పురోహిత్ ను రెండో వివాహం చేసుకుంది. ఆయన ఆరు జాతీయ అవార్డులు అందుకున్న ఫిల్మ్ మేకర్. ఎమ్మీ అవార్డులకు కూడా నామినేట్ అయ్యారు. టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మి బలైపోవద్దు. మాన్సాస్, సింహాచలం దేవస్థానాల ఆడిట్ రిపోర్టుల్లో తమ అసలు రూపాలు బయటపడతాయనే భయంలో టీడీపీ ఉంది. ఒక హిందువుగా నేను అన్ని మతాలను గౌరవిస్తా. మీ మాటను సవరిస్తూ ఒక ప్రకటన ఇస్తే చంద్రబాబు, ఆయన అనుచరుల ఆరోపణలకు ఫుల్ స్టాప్ పడుతుంది’ అంటూ పవన్ ని తన ట్విట్టర్లో కోరారు సంచయిత.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu