బన్నీ రిలీజ్ చేసిన విష్ణు, కాజల్ ‘మోసగాళ్లు’ టీజర్లో ట్రంప్
మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా వస్తోన్న సినిమా ‘మోసగాళ్లు’. ఇటీవల రిలీజైన పోస్టర్స్ తో ప్రేక్షకుల్ని ఆకర్షించిన ఈ సినిమా టీజర్ గ్లింప్స్ ను తాజాగా రిలీజ్ చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఉదయం టీజర్ ను విడుదల చేసి టీం కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రపంచంలోని ఒక బిగ్గెస్ట్ స్కామ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ‘2016లో జరిగిన 450 మిలియన్ డాలర్ల బిగ్గెస్ట్ స్కామ్ గురించి […]
మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా వస్తోన్న సినిమా ‘మోసగాళ్లు’. ఇటీవల రిలీజైన పోస్టర్స్ తో ప్రేక్షకుల్ని ఆకర్షించిన ఈ సినిమా టీజర్ గ్లింప్స్ ను తాజాగా రిలీజ్ చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఉదయం టీజర్ ను విడుదల చేసి టీం కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రపంచంలోని ఒక బిగ్గెస్ట్ స్కామ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ‘2016లో జరిగిన 450 మిలియన్ డాలర్ల బిగ్గెస్ట్ స్కామ్ గురించి అగ్ర రాజ్య అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో అడ్రెస్ చేస్తున్న స్పీచ్ తో మొదలయ్యి.. ఆ భారీ మొత్తాన్ని దోచే జంటగా విష్ణు అండ్ కాజల్ కనిపించి.. ఇది సరిపోతుందిగా అని కాజల్ అంటే.. ఆట ఇప్పుడే మొదలయ్యింది అంటూ ఎండ్ చేసారు. ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించగా.. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. విష్ణు స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మళయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు.
Here is a glimpse of the size of the scam in #Mosagallu. Best wishes to my childhood friend and schoolmate @ivishnumanchu & my dearest @MsKajalAggarwal. All the best to the Dir , Prod and the entire team. Here we go. #MosagalluTeaser –> https://t.co/trn8wdbGYO
— Allu Arjun (@alluarjun) October 3, 2020