విషాదం : కుమారుడికి కరోనా పాజిటివ్, పిచ్చోడైపోయిన తండ్రి
కరోనా మనుషుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. మానవ సంబంధాల మధ్య చిచ్చు పెడుతోంది. మనుషుల్లోని మానవతను ప్రశ్నిస్తోంది. మరికొందర్ని పిచ్చివాళ్లగా చేస్తోంది.

కరోనా మనుషుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. మానవ సంబంధాల మధ్య చిచ్చు పెడుతోంది. మనుషుల్లోని మానవతను ప్రశ్నిస్తోంది. మరికొందర్ని పిచ్చివాళ్లగా చేస్తోంది. కరోనా వల్ల ఒక్కో కుటుంబంలో ఒక్కో వ్యథ. బయటకు చెప్పుకోలేని బాధ. ఇటీవల బయటకు వస్తోన్న కొన్ని ఘటనలు అందర్నీ కలవరపెడుతున్నాయి. కోవిడ్ భయంతో కొంతమంది ప్రాణాలు తీసుకుంటుంటే.. మరికొందరు మానసికంగా సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో కూడా ఇటువంటి ఘటనే జరిగింది. కుమారుడికి కోవిడ్ సోకిందన్న భయం, ఆందోళనతో ఓ తండ్రి మతిస్థిమితం కోల్పోయాడు.
జిల్లాలోని తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన తండ్రీకొడుకులకు ఇటీవల కోవిడ్ టెస్టులు చేశారు. కుమారుడి పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వడంతో తాడేపల్లిగూడెం కొవిడ్ కేర్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కుమారుడికి కరోనా సోకడంతో తండ్రి తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. కొడుకు ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర మానసిక సంఘర్షనకు గురై మతిస్థిమితం కోల్పోయాడు. ఒంటిపై బట్టలు లేకుండా ఇంటి గుమ్మం దగ్గరే కూర్చుని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ ఏడుస్తున్నారు. కరోనా భయంతో ఇరుగు, పొరుగు వారెవరూ ఆయన దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. దీంతో స్పందించిన అధికారులు ఆ వృద్ధుడిని ఏలూరులోని ఆశ్రం ఆస్పత్రికి తరలించారు.
మనం పోరాడాల్సింది కరోనా రోగితో కాదు..వ్యాధితో
Also Read :
ప్రధానికి సీఎం జగన్ లేఖ, ఈ అంశం గురించే
సీమ ప్రాజెక్టులపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం
ఇంట్లో నిద్రపోతున్న ముగ్గురు చిన్నారులను కాటేసిన కట్లపాము