Pakistan: పాక్ సైన్యానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న దాడులు.. భద్రతా పోస్ట్‌పై దాడి 16 మంది సైనికులు మృతి, 8 మందికి గాయాలు
మన దాయాది దేశం పాకిస్తాన్ లో బాంబు పేలుళ్లు, దాడులు సర్వసాధారణంగా మారిపోయాయి. రోజు ఎక్కడోచోట బాంబు దాడి జరిగిందనే వార్త వినిపిస్తూనే ఉంది. తాజాగా ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో భద్రతా పోస్ట్ పై బాంబ్ దాడి జరిగింది. ఈ దాడిలో 16 మంది సైనికులు మరణించారు, 8 మంది గాయపడ్డారు. వెంటనే స్పందించిన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. అనుమానితుల కోసం సోదాలు నిర్వహిస్తున్నారు.
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో భారీ దాడి జరిగింది. ఈ దాడిలో 16 మంది సైనికులు మరణించగా, 8 మంది గాయపడినట్లు సమాచారం. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దాడి జరిగిన ప్రాంతలో సోదాలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఈ దాడి దక్షిణ వజీరిస్థాన్‌లోని మకిన్‌లోని లిటా సార్ ప్రాంతంలోని పాకిస్తాన్ భద్రతా పోస్ట్‌పై జరిగింది. అయితే ఉగ్రదాడి అని అధికారులతో సహా పలువురు అనుమానిస్తున్నారు.
అయితే ఈ దాడికి తమ పనే అంటూ ఇప్పటి వరకు ఏ సంస్థ బాధ్యత వహించలేదు. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రతి రోజూ దాడులు జరిగుతున్న ప్రాంతంగా మారిపోయింది. ఇక్కడ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఈ దాడులకు తెహ్రీక్-ఏ-తాలిబాన్ (టీటీపీ) కారణమని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌లోని టీటీపీ ఫైటర్‌లకు ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం ఆశ్రయం ఇస్తోందని కూడా ఆరోపించింది.
ఇటీవల.. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రి అలీ అమీన్ గండాపూర్ మాట్లాడుతూ,, ఈ ప్రాంతంలో శాంతి, భద్రతలను కాపాడుకావాలన్నా.. దాడులు ఆగాలన్నా.. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వంతో చర్చలు మాత్రమే మార్గమని అన్నారు. అలీ అమీన్ ఇమ్రాన్ ఖాన్ కి సంబందించిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీలోని ఫైర్ బ్రాండ్ నాయకుడుల్లో ఒకడుగా పరిగణించబడ్డాడు.
పాకిస్థాన్‌లో ప్రతిరోజూ బాంబు పేలుళ్లు
గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ ప్రజలు పేలుళ్లు, దాడులతో సహజీవనం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో పేలుళ్లు, దాడుల వార్తలు సర్వసాధారణంగా మారిపోయాయి. కొద్ది రోజుల క్రితం కూడా పాకిస్థాన్‌లో బాంబు పేలుడు జరిగింది. పాకిస్థాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది, ఇందులో 25 మంది మరణించారు . 50 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్థాన్‌లోని ఉత్తర వజీరిస్థాన్‌లో జరిగిన బాంబు పేలుడులో నలుగురు భద్రతా సిబ్బంది మరణించగా, పలువురు గాయపడ్డారు. అంతేకాదు ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని పాఠశాల సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు చిన్నారులు చనిపోయారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..