ముక్కలైన గాంధీజీ విగ్రహం.. ఎక్కడంటే ?

గుజరాత్ లోని అమ్రేలి జిల్లాలో జాతిపిత గాంధీజీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. హరికృష్ణ సరస్సు  వద్ద ఓ గార్డెన్ సమీపంలో ఇది ముక్కలై కనిపించింది. సూరత్ లోని డైమండ్ మర్చంట్ సావ్ జీ భాయి ధోలకియా ఆధ్వర్యంలోని ధోలకియా ఫౌండేషన్ ఈ విగ్రహాన్ని 2017 లో ఏర్పాటు చేయగా.. 2018 లో ప్రధాని మోడీ దీన్ని ఆవిష్కరించారు. ఈ సరస్సు వద్ద చేపడుతున్న నిర్మాణాలను  వ్యతిరేకిస్తున్న సంఘ వ్యతిరేక శక్తులు ఈ విగ్రహాన్ని […]

ముక్కలైన గాంధీజీ విగ్రహం.. ఎక్కడంటే ?
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Jan 05, 2020 | 1:50 PM

గుజరాత్ లోని అమ్రేలి జిల్లాలో జాతిపిత గాంధీజీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. హరికృష్ణ సరస్సు  వద్ద ఓ గార్డెన్ సమీపంలో ఇది ముక్కలై కనిపించింది. సూరత్ లోని డైమండ్ మర్చంట్ సావ్ జీ భాయి ధోలకియా ఆధ్వర్యంలోని ధోలకియా ఫౌండేషన్ ఈ విగ్రహాన్ని 2017 లో ఏర్పాటు చేయగా.. 2018 లో ప్రధాని మోడీ దీన్ని ఆవిష్కరించారు. ఈ సరస్సు వద్ద చేపడుతున్న నిర్మాణాలను  వ్యతిరేకిస్తున్న సంఘ వ్యతిరేక శక్తులు ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉండవచ్చునని, కేసు నమోదు చేసుకుని వారికోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.