AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త బిల్డింగ్ ను క్వారంటైన్ కు ఇచ్చిన ముంబై బిల్డర్

కొత్తగా కరోనా సోకుతున్న వారిని క్వారంటైన్ చేయడానికి ముంబై మున్సిపల్ కార్పోరేషన్ కి తలనొప్పిగా మారుతోంది. అయితే ముంబైకి చెందిన ప్రైవేటు బిల్డ‌ర్ మెహుల్ సంఘ్వి.. తాను నిర్మించిన బిల్డింగ్‌ను గ్రేట‌ర్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కు అప్ప‌గించేందుకు సిద్ధమయ్యాడు.

కొత్త బిల్డింగ్ ను క్వారంటైన్ కు ఇచ్చిన ముంబై బిల్డర్
Balaraju Goud
|

Updated on: Jun 21, 2020 | 7:04 PM

Share

కరోనా కరాళనృత్యానికి మహారాష్ట్ర విలవిలలాడుతోంది. రోజు రోజుకి కొవిడ్ కేసుల సంఖ్య వేలు దాటుతోంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో మూడొంతుులు మహారాష్ట్రలోనే వెలుగుచూస్తున్నాయి. అయితే రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల్లో స‌గానికి పైగా ముంబై సిటీలోనే నమోదవుతున్నాయి. దాదాపు 65 వేల‌కు పైగా ముంబై వాసులు క‌రోనా బారిన‌ప‌డ్డారు. కరోనా పేషేంట్లకు చికిత్స అందించేందుకు నగరంలోని ఆస్పత్రులు సరిపోవడంలేదు. బీఎంసీ అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రైవేట్ ఆస్పత్రులు కూడా కరోనా బాధితులతో నిండిపోతున్నాయి. కొత్తగా కరోనా సోకుతున్న వారిని క్వారంటైన్ చేయడానికి ముంబై మున్సిపల్ కార్పోరేషన్ కి తలనొప్పిగా మారుతోంది. అయితే ముంబైకి చెందిన ప్రైవేటు బిల్డ‌ర్ మెహుల్ సంఘ్వి.. తాను నిర్మించిన బిల్డింగ్‌ను గ్రేట‌ర్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కు అప్ప‌గించేందుకు సిద్ధమయ్యాడు. కొత్తగా కట్టిన 19 అంతస్తుల బిల్డింగ్‌లోని ఫ్లాట్లను ఇచ్చేందుకు అంగీకరించాడు. అందులో ఉండాల‌నుకున్న టెనెంట్ల‌తోనూ చ‌ర్చించి.. దాన్ని క్వారంటైన్ సెంట‌ర్‌గా మార్చేందుకు కార్పోరేషన్ అధికారులకు అప్పగించాడు.వెంటనే క్వారంటైన్ కేంద్రంగా వాడుకునేందుకు కావాల్సిన స‌దుపాయాలు ఉన్నాయ‌ని సంఘ్వి వివరించారు.

Follow Us
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన