‘మహా’ పోలీసుల్లో కలవరం.. 4 వేలు దాటిన కరోనా కేసులు
పోలీసు విభాగంలో కరోనా మరింత కలవరానికి గురిచేస్తోంది. మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో కొత్తగా 88 మంది పోలీసులు కొవిడ్-19 బారిన పడినట్టు అధికారులు వెల్లడించారు.

మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఫ్రంట్ వారియర్స్ కూడా కొవిడ్ బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసు విభాగంలో కరోనా మరింత కలవరానికి గురిచేస్తోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 88 మంది పోలీసులు కొవిడ్-19 బారిన పడినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో కరోనా బారిన పడిన మహారాష్ట్ర పోలీసుల సంఖ్య 4048కి చేరింది. ప్రస్తుతం 1001 మంది పోలీసులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఇవాళ మరో పోలీస్ కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మొత్తం 47 మంది మరణించారు.




