న్యూఇయర్‌లో కలిసోచ్చిన అదృష్టం.. 15 ఏళ్ళ క్రితం రైళ్లో పోయిన బంగారు లాకెట్.. ఇప్పుడిలా..
ఈ న్యూఇయర్ ఓ మహిళకు బాగా కలిసోచ్చింది. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ పోగుట్టుకున్న బంగారు లాకెట్ తిరిగి ఆమె చెంతకు చేరింది.
ఈ న్యూఇయర్ ఓ మహిళకు బాగా కలిసోచ్చింది. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ పోగుట్టుకున్న బంగారు లాకెట్ తిరిగి ఆమె చెంతకు చేరింది. తనకు ఇష్టమైన లాకెట్ మళ్ళీ తన దగ్గరకు చేరడంతో ఆ మహిళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
వివరాల్లోకెలితే.. మహారాష్ట్రకు చెందిన రేష్మ అనే మహిళ పదిహేళ్ళ క్రితం రైలు ప్రయాణంలో విఘ్నేశ్వరుని రూపంలో ఉన్న బంగారపు లాకెట్‌ను పోగొట్టుకుంది. దాంతో వెంటనే అక్కడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనకు ఎంతో ఇష్టమైన లాకెట్ పోవడంతో ఆ మహిళ చాలా బాధపడిందట. చాలా కాలం తర్వాత పోలీసులు ఆ మహిళ పోగొట్టుకున్న లాకెట్ కేసును చేధించారు. అది ఆమెకు ఇవ్వడానికి చాలా సార్లు ప్రయాత్నించారట. కానీ ఫిర్యాదు సమయంలో ఆమె ఇచ్చిన అడ్రస్‌కు వెళ్ళి చూడగా.. తను అక్కడ ఉండటం లేదని తెలిసింది. దీంతో ఆ లాకెట్‌ను ఆమె ఇవ్వలేకపోయారు పోలీసులు. అప్పటి నుంచి ఆ మహిళ అడ్రస్ కోసం పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నామని.. చివరకు ఆమె ఆధార్ నెంబర్ ఆధారంగా అడ్రస్ తెలుసుకున్నామని రైల్వే పోలీసు సీనియర్ ఇన్స్పెక్టర్ ఎన్‌జీ ఖాడ్కర్ తెలిపారు. న్యూూఇయర్ సందర్భంగా ఆమెకు ఆ లాకెట్ ఇవ్వాలని అనుకున్నాట్లు తెలిపారు. అనుకున్నట్లుగానే కొత్త సంవత్సరం రోజున రేష్మకు ఆ బంగారపు లాకెట్‌ను అందజేశారు. ఎన్నో సంవత్సరాల కిందట పోగొట్టున్న అదృష్టం తిరిగి తన దగ్గరకు రావడంతో రేష్మ సంతోషం వ్యక్తం చేశారు.