మహారాష్ట్ర పోల్ ప్యానెల్ వివాదంపై నివేదిక కోరన ఈసీ

మహారాష్ట్ర ఎన్నికల సమయంలో ప్రమోషన్ కోసం బిజెపి-ః అనుసంధాన సంస్థను ఈసి నియమించిందన్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని మహారాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిని ఆదేశించింది.

మహారాష్ట్ర పోల్ ప్యానెల్ వివాదంపై నివేదిక కోరన ఈసీ
Follow us

|

Updated on: Jul 24, 2020 | 5:35 PM

మహారాష్ట్ర ఎన్నికల సమయంలో ప్రమోషన్ కోసం బిజెపి-ః అనుసంధాన సంస్థను ఈసి నియమించిందన్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని మహారాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిని ఆదేశించింది.

2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోషల్ మీడియా ప్రమోషన్ల కోసం బిజెపి ఐటి సెల్‌తో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోల్ బాడీ నియమించిందని ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే కేంద్ర సీఈసీకి ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన ఈసీ మహారాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి నుండి నివేదిక కోరినట్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. గత సంవత్సరం ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్లు ట్వీట్టర్ లో పేర్కొన్నారు. ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే చేసిన ట్వీట్లపై శరణ్ స్పందిస్తూ పోల్ ప్యానెల్‌లో ఈ ఆరోపణలను విచారణ జరుపుతున్నామన్నారు. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదిక అందించాలని రాష్ట్ర కమిషన్ ను కోరినట్లు ఈసీఈ ప్రతినిధి షెఫాలి శరణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే తన సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ నియమించిన సంస్థ నే బిజెపి కూడా నియమించిందని అని సాకేత్ గోఖలే తన ట్వీట్లలో పేర్కొన్నారు. మహారాష్ట్ర మాజీ సిఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో సన్నిహిత సంబంధాలున్న ప్రభుత్వ-ఎంపానెల్ ఏజెన్సీ అయిన సిగ్‌పోస్ట్ ఇండియా చిరునామాతో రిజిస్టర్ అయినట్లు పేర్కొన్నారు. దీంతో గత ఏడాది జూన్ నుండి పదవిలో ఉన్న మహారాష్ట్ర సిఈఓ బల్దేవ్ హర్పాల్ సింగ్ వాస్తవాలతో కూడిన వివరణాత్మక నివేదిక కోరిందని షెఫాలి శరణ్ ట్వీట్‌లో వెల్లడించారు.