రామమందిర భూమి పూజను వ్యతిరేకిస్తూ దాఖలైన పిల్ కొట్టివేత
యూపీలోని అయోధ్యలో ఆగస్టు 5వ తేదీన రామ మందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో..

యూపీలోని అయోధ్యలో ఆగస్టు 5వ తేదీన రామ మందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అన్‌లాక్ 2.0 నిబంధనలకు విరుద్దంగా కార్యక్రమానికి 200 మంది హాజరయ్యే అవకాశం ఉందని.. దీని ద్వారా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందే అవకాశం ఉందంటూ.. ఢిల్లీకి చెందిన ఓ సోషల్ యాక్టివిస్ట్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆగస్టు 5వ తేదీన తలపెట్టిన రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రామన్ని జరగకుండా ఆదేశాలివ్వాలంటూ పిటిషనర్ అందులో పేర్కొన్నాడు. అయితే శుక్రవారం నాడు పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.
కాగా, ఆగస్టు 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ మందిర నిర్మాణానికి హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ట్రస్టు బోర్డు ప్రకటించింది. కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే మందిర నిర్మాణ పనులను అడ్డుకునేందుకు కొందరు కోర్టులను ఆశ్రయిస్తున్నారు.



