కాంగో ఫీవర్, మహారాష్టకు మరో ముప్పు !
ఇప్పటికే కరోనా మహమ్మారితో అల్లాడిపోతున్న మహారాష్ట్రను మరో విపత్తు చుట్టుముట్టింది. మహారాష్ట్రలోని జిల్లాలలో భయానకమైన కాంగో జ్వరం వ్యాప్తి చెందే అవకాశాలున్న నేపథ్యంలో అలెర్ట్ గా ఉండాలని పాల్ఘర్ పరిపాలన విభాగం మంగళవారం అధికారులను ఆదేశించింది.
ఇప్పటికే కరోనా మహమ్మారితో అల్లాడిపోతున్న మహారాష్ట్రను మరో విపత్తు చుట్టుముట్టింది. మహారాష్ట్రలోని జిల్లాలలో భయానకమైన కాంగో జ్వరం వ్యాప్తి చెందే అవకాశాలున్న నేపథ్యంలో అలెర్ట్ గా ఉండాలని పాల్ఘర్ పరిపాలన విభాగం మంగళవారం అధికారులను ఆదేశించింది. కాంగో జ్వరంగా పిలిచే క్రిమియన్ కాంగో హెమోరేజిక్ ఫీవర్ (సీసీహెచ్ఎఫ్), పేలు ద్వారా మానవులలో వ్యాప్తి చెందుతుంది. ఇది మాంసం విక్రేతలు, పశువుల పెంపకందారులకు ఆందోళన కలిగించే విషయమని అధికారులు చెబుతున్నారు. దీనికి సరైన వ్యాక్సిన్ లేదా మెడిసిన్, చికిత్స అందుబాటులో లేని కారణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు. పాల్ఘర్ పశుసంవర్ధక శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ప్రశాంత్ డి కాంబ్లే ఈ వ్యాధికి సంబంధించి ఒక సర్క్యులర్ విడుదల చేశారు. కాంగో జ్వరం గుజరాత్‌లోని కొన్ని జిల్లాల్లో కనుగొనబడిందని, ఇది మహారాష్ట్రలోని బార్డర్ జిల్లాలకు వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్పారు.
పాల్ఘర్ గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాకు సమీపంగా ఉంది. వల్సాద్ జిల్లాలో ఇప్పటికే కొన్ని కేసులు నమోదయ్యాయని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకొని నివారణ చర్యలు యుద్దప్రాతిపదికన తీసుకోవాలని అధికారులను సంబంధిత శాఖ విభాగం సూచించింది. ఈ వ్యాధి ఒక నిర్దిష్ట రకం పేల ద్వారా ఒక జంతువు నుంచి మరొక జంతువుకు వ్యాపి చెందుతుందని, వ్యాధి సోకిన జంతువుల మాంసాన్ని తినడం ద్వారా.. మనుషులకు వ్యాపిస్తుందని… అందుకే జాగ్రత్తగా ఉండాలని మహారాష్ట్రలో ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఈ వ్యాధిని గుర్తించి, సరైన చికిత్స చేయకపోతే 30 శాతం మంది రోగులు మరణించే అవకాశం ఉంది.
Also Read :