‘రాజీనామా చేయనని చెప్పారే’, ఏక్ నాథ్ పై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్

మహారాష్ట్రలో బీజేపీ సీనియర్ నేత ఏక్ నాథ్ ఖాడ్సే  రాజీనామా చేసిన వెంటనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ స్పందిస్తూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడబోనని ఏక్ నాథ్ చాలాసార్లు చెప్పారని అన్నారు.  ఆయన రాజీనామా అందిందని, దాన్ని ఆమోదించా మని పాటిల్ చెప్పారు. అసలు ముందుండి పార్టీని నడిపించమని చెప్పామని, కానీ ఆయన ఫెయిలయ్యారని పాటిల్ పేర్కొన్నారు. ఎన్నిసార్లని బుజ్జ గిస్తాం అని ప్రశ్నించారు. మొత్తానికి ఏక్ నాథ్ ఏదో పార్టీని ఎంచుకున్నారు. శుభం […]

  • Umakanth Rao
  • Publish Date - 7:08 pm, Wed, 21 October 20
'రాజీనామా చేయనని చెప్పారే', ఏక్ నాథ్ పై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్

మహారాష్ట్రలో బీజేపీ సీనియర్ నేత ఏక్ నాథ్ ఖాడ్సే  రాజీనామా చేసిన వెంటనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ స్పందిస్తూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడబోనని ఏక్ నాథ్ చాలాసార్లు చెప్పారని అన్నారు.  ఆయన రాజీనామా అందిందని, దాన్ని ఆమోదించా మని పాటిల్ చెప్పారు. అసలు ముందుండి పార్టీని నడిపించమని చెప్పామని, కానీ ఆయన ఫెయిలయ్యారని పాటిల్ పేర్కొన్నారు. ఎన్నిసార్లని బుజ్జ గిస్తాం అని ప్రశ్నించారు. మొత్తానికి ఏక్ నాథ్ ఏదో పార్టీని ఎంచుకున్నారు. శుభం అని వ్యాఖ్యానించారు.