కోయిల్ సాగర్ ప్రాజెక్టులో జలకళ.. గేట్లు ఎత్తివేత
తెలంగాణలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. చాలా ప్రాజక్టులలో నీటి మట్టం పెరగడంతో గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని..

తెలంగాణలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. చాలా ప్రాజక్టులలో నీటి మట్టం పెరగడంతో గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టు పూర్తిగా నీటితో నిండిపోయింది. ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరగడంతో అధికారులు 3 గేట్లను ఎత్తి 1800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో, కోయిల్ సాగర్ దిగువ ప్రాంతంలో ఊక చెట్టు వాగు జలకళ సంతరించుకుంది. నీరు పరవళ్లు తొక్కుతుండటంతో ఆత్మకూరు, మాదనపురం, వనపర్తి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో, చెరువులు కుంటలు ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తిస్థాయిలో నిండాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



