37ఏళ్ల తరువాత.. మహాసంప్రోక్షణ
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోని శ్రీభూవరాహస్వామి ఆలయంలో మహాసంప్రోక్షణకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 37ఏళ్ల తరువాత ఈ ఆలయంలో మహా సంప్రోక్షణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఇందుకు అంకురార్పణ చేయనున్నారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి దర్శనం కోసం భక్తులు 4కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4గంటలు, వీఐపీ దర్శనానికి 3గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 96,236మంది దర్శించుకున్నారు.

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోని శ్రీభూవరాహస్వామి ఆలయంలో మహాసంప్రోక్షణకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 37ఏళ్ల తరువాత ఈ ఆలయంలో మహా సంప్రోక్షణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఇందుకు అంకురార్పణ చేయనున్నారు.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి దర్శనం కోసం భక్తులు 4కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4గంటలు, వీఐపీ దర్శనానికి 3గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 96,236మంది దర్శించుకున్నారు.