ఓవర్ నైట్‌లోనే కోటీశ్వరురాలైన కౌసల్య కార్తిక.. అసలేం జరిగిందంటే!

ప్రపంచంలోనే ఓ గేమ్ షోలో కోటి గెలిచిన మహిళ ఆమె. ఆత్మవిశ్వాసం తనదైతే అంగవైకల్యం అడ్డురాదని వెలుగెత్తి చాటింది. ఆమెనే తమిళనాడులోని మధురైకి చెందిన కౌసల్యా కార్తిక. ఆమెకు వినపడదు, మాట్లాడలేదు. అందుకే ఆమెను అంగవైకల్యురాలు అనేకంటే ప్రత్యేక ప్రతిభావంతురాలు అనాలి. కౌసల్య కార్తిక.. పుట్టింది, పెరిగింది అంతా మధురైలో. బీఎస్సీ టెక్నాలజీ, ఎంఎస్సీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎంబీఏ పట్టభద్రురాలైన కౌసల్య కార్తిక పుట్టు మూగ, చెవుడు. 31 ఏళ్ల కౌసల్య కార్తికకు భర్త, ఏడాది పిల్లాడు […]

ఓవర్ నైట్‌లోనే కోటీశ్వరురాలైన కౌసల్య కార్తిక.. అసలేం జరిగిందంటే!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 21, 2020 | 5:43 PM

ప్రపంచంలోనే ఓ గేమ్ షోలో కోటి గెలిచిన మహిళ ఆమె. ఆత్మవిశ్వాసం తనదైతే అంగవైకల్యం అడ్డురాదని వెలుగెత్తి చాటింది. ఆమెనే తమిళనాడులోని మధురైకి చెందిన కౌసల్యా కార్తిక. ఆమెకు వినపడదు, మాట్లాడలేదు. అందుకే ఆమెను అంగవైకల్యురాలు అనేకంటే ప్రత్యేక ప్రతిభావంతురాలు అనాలి.

కౌసల్య కార్తిక.. పుట్టింది, పెరిగింది అంతా మధురైలో. బీఎస్సీ టెక్నాలజీ, ఎంఎస్సీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎంబీఏ పట్టభద్రురాలైన కౌసల్య కార్తిక పుట్టు మూగ, చెవుడు. 31 ఏళ్ల కౌసల్య కార్తికకు భర్త, ఏడాది పిల్లాడు ఉన్నారు. ప్రస్తుతం మధురై ప్రిన్సిపుల్ సెషన్స్ జడ్జి కోర్టులో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తుంది. కౌసల్య కార్తిక చిన్న వయస్సు నుండే మంచి తెలివైన పిల్లగా గుర్తింపు తెచ్చుకుంది. ప్లస్ టూ వరకు నాగర్ కోయిల్‌లోని బదిరుల పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన ఆమె.. చదువుల్లో ఎప్పుడూ పస్ట్ ర్యాంక్ విద్యార్థినే. పట్టభద్రురాలైన ఆమె బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంబీఏలో కూడా గోల్డ్ మెడలిస్టే. అయితే ఆమెకు చిన్నప్పటి నుండి రెండు కలలు ఉండేవి.

మొదటిది తాను చదివిన‌ బదిరుల పాఠశాలకు సాయం చేయాలి, రెండోది స్విట్జర్లాండ్ పర్యటన చేయాలి. ఈ రెండు కోరికలతోపాటు ఆత్మ విశ్వాసం ఆమెను ‘కోటీశ్వరి’గా నిలిపేలా చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా కలర్స్ ఛానెల్.. తమిళంలో మహిళల కోసం ప్రత్యేకంగా ‘కోటీశ్వరీ’ అనే గేమ్ షో ప్రారంభించింది. సీనియర్ నటి రాధిక ఈ షోకి యాంకర్‌గా వ్యవరిస్తున్నారు. ఈ షోలో ఎందరో మహిళలు పాల్గొన్నా.. కోటి రూపాయలు ఎవరూ గెలుచుకోలేదు. కేవలం కౌసల్య మాత్రమే ఫైనల్‌కు చేరింది.

రాధిక అడిగిన ప్రశ్నలకు శబ్దరూపంలో లిప్ రీడింగ్ ద్వారా అర్థం చేసుకుని సమాధానాలను అందించిన‌ కౌసల్య కార్తిక సుదీర్ఘ ఆటలో కోటి రూపాయిల బహుమతి పొందింది. తద్వారా షో మొదటి సీజన్‌లోనే కోటి రూపాయిల ప్రైజ్ మనీ పొంది.. ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రత్యేక ప్రతిభావంతురాలిగా కౌసల్య నిలిచింది. కోటి రూపాయిలకు సంబంధించిన ఫైనల్ ఎపిసోడ్ జనవరి 21 రాత్రి 8 గంటలకు కలర్స్ తమిళ చానెల్ ప్రసారం చేస్తుండగా కౌసల్య కార్తిక, నటి రాధిక మీడియాతో మాట్లాడారు. ఈ షో ద్వారా నా రెండు కలలు నిజం కాబోతున్నాయంటూ కౌసల్య కార్తిక ఆనందం వ్యక్తం చేసింది. కాగా ఇటువంటి ప్రత్యేక ప్రతిభావంతురాలు కౌసల్య కార్తికను ప్రపంచం చూడటం ఇదే మొదటిసారి కాబోతుందని అటు రాధిక కూడా అభినందనల వర్షం కురిపించారు.