కెనడా చేరిన మాజీ రాచ దంపతులు.. ఇక రాయల్ హోదాకు స్వస్తి !

బ్రిటన్ రాచరిక హోదా వదులుకున్న ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ కెనడాలోని వాంకోవర్ చేరుకున్నారు. మొదట మార్కెల్ తన ఎనిమిది నెలల  కుమారుడు ఆర్చీతోను, తను ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న రెండు శునకాలతోను ఈ సిటీలో అడుగు పెట్టారు. ఆమె ఇక్కడికి చేరుకున్న కొన్ని గంటల్లోనే హ్యారీ కూడా బ్రిటన్ నుంచి ఇక్కడికి వచ్చారు. వాంకోవర్ లోని హార్త్ హిల్ రీజనల్ పార్కులో ఇద్దరు బాడీగార్డులు వెంట వస్తుండగా.. మార్కెల్ చిరునవ్వులు చిందిస్తూ ముందుకు […]

కెనడా చేరిన మాజీ రాచ దంపతులు.. ఇక రాయల్ హోదాకు స్వస్తి !
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 21, 2020 | 5:39 PM

బ్రిటన్ రాచరిక హోదా వదులుకున్న ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ కెనడాలోని వాంకోవర్ చేరుకున్నారు. మొదట మార్కెల్ తన ఎనిమిది నెలల  కుమారుడు ఆర్చీతోను, తను ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న రెండు శునకాలతోను ఈ సిటీలో అడుగు పెట్టారు. ఆమె ఇక్కడికి చేరుకున్న కొన్ని గంటల్లోనే హ్యారీ కూడా బ్రిటన్ నుంచి ఇక్కడికి వచ్చారు. వాంకోవర్ లోని హార్త్ హిల్ రీజనల్ పార్కులో ఇద్దరు బాడీగార్డులు వెంట వస్తుండగా.. మార్కెల్ చిరునవ్వులు చిందిస్తూ ముందుకు సాగారు.

కెనడా చేరకముందు హ్యారీ.. లండన్ లో జరిగిన బ్రిటన్-ఆఫ్రికా ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ కు హాజరయ్యారు. తమ ‘ రాచరిక హోదా ‘ వదులుకున్న ఈ దంపతులు ఇక కెనడాలోనే స్థిరపడే అవకాశం కనిపిస్తోంది. తమ ఆధ్వర్యంలోని ప్రొడక్షన్ హౌస్ ద్వారా వీరు క్లైమేట్ వంటి సామాజిక సమస్యలపై డాక్యుమెంటరీలు నిర్మించనున్నారు. మెర్కెల్ ఇప్పటికే కొన్ని డాక్యుమెంటరీలకు వాయిస్-ఓవర్ ఇచ్చారట.  రాయల్ హోదా వదులుకున్న కారణంగా ఈ జంటకు బ్రిటన్ ప్రభుత్వం నుంచి నిధులు అందవు. అయితే తాము ఇక సాధారణ పౌరుల్లాగా జీవిస్తామని హ్యారీ, మెర్కెల్ ఇదివరకే ప్రకటించారు.