మధ్యప్రదేశ్‌లో అతి భారీ వర్షాలు.. 8 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక!

మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎనిమిది జిల్లాల్లో శుక్రవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది.

మధ్యప్రదేశ్‌లో అతి భారీ వర్షాలు.. 8 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 13, 2020 | 6:17 PM

మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎనిమిది జిల్లాల్లో శుక్రవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని ఐఎండీ భోపాల్ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త జీడీ మిశ్రా తెలిపారు. చింద్వారా, బాలాఘాట్, బేతుల్, హర్దా, ఖండ్వా, అలీరాజ్‌పూర్, ఝాబా, ధార్ జిల్లాల్లో శుక్రవారం ఉదయం వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన వివరించారు.

కాగా.. అనూప్పూర్, దిందోరి, చత్తర్‌పూర్, సెహోర్, రాజ్‌గఢ్, హోషంగాబాద్, బుర్హన్‌పూర్, ఖార్గోన్, బార్వానీ, దేవాస్, అగర్, శివపురి, డాటియా, మోరెనా, షియోపూర్, 15 జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని మిశ్రా తెలిపారు. ఆయా జిల్లాల్లో ‘యెల్లో వార్నింగ్’ జారీ చేసినట్టు పేర్కొన్నారు.

64.5 మిమీ నుంచి 115.5 మిమీ పరిధిలో కురిసే వర్షాన్ని ‘భారీ వర్షపాతం’ గా పరిగణిస్తారు. 115.6 మిమీ నుంచి 204.4 మిమీ మధ్య ‘అతి భారీ వర్షపాతం’ గా పరిగణిస్తారని ఐఎండీ పేర్కొంది. గత 24 గంటల్లో సత్నా జిల్లాలో 132.6 మిల్లీమీటర్ల వర్షపాతం, రేవా జిల్లాలో 42.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది, టికామ్‌గర్ ‌లో 41 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని మిశ్రా తెలిపారు.

Read More:

హెల్మెట్‌లకు బీఐఎస్‌ లేకుంటే ఇక బాదుడే!

అక్కడి మెడికల్‌ కళాశాలల డిగ్రీలు చెల్లవు: ఎంసీఐ