AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: దేశ సేవలో ఉన్న CRPF జవాన్‌ను హింసిస్తున్న రాజకీయ నేతలు! సెల్ఫీ వీడియోతో నారా లోకేష్‌కు వేడుకోలు..

మాచర్లకు చెందిన CRPF జవాన్ దార్ల రాందాస్, పూర్వీకుల ఆస్తిని అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నాడు. స్థానిక రాజకీయ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. అప్పుల భారంతో సతమతమవుతున్న రాందాస్, మంత్రి నారా లోకేష్‌ను సహాయం కోసం వేడుకున్నాడు.

Video: దేశ సేవలో ఉన్న CRPF జవాన్‌ను హింసిస్తున్న రాజకీయ నేతలు! సెల్ఫీ వీడియోతో నారా లోకేష్‌కు వేడుకోలు..
Crpf Jawan And Nara Lokesh
T Nagaraju
| Edited By: |

Updated on: Jun 26, 2025 | 8:42 AM

Share

మాచర్ల పట్టణానికి చెందిన దార్ల రాందాస్ CRPF జవాన్‌గా దేశానికి సేవలందిస్తున్నాడు. రెండు నెలల క్రితం సెలవులపై ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తమకు పూర్వీకుల నుండి సంక్రమించిన భూమిని అమ్ముకునేందుకు ప్రయత్నించాడు. అయితే కొంతమంది రాజకీయ నేతలు ఆ భూమిని అమ్ముకోనివ్వకుండా అడ్డుపడ్డారు. దీంతో అప్పులతో సతమతమవుతూనే రాందాస్ డ్యూటీకి తిరిగి వెళ్లిపోయాడు.

రాందాస్ సోదరుడు మూడేళ్ల క్రితం చనిపోయాడు. రాందాస్ తండ్రికి కూడా గుండె శస్త్రచికిత్స చేశారు. దీంతో అప్పుల భారం మరింత పెరిగింది. దీంతో మరోసారి తన భూమిని విక్రయించుకునేందుకు అక్కడ నుండే ప్రయత్నించారు. స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు మరోసారి అడ్డుపడ్డారు. దీంతో ఆవేదనకు లోనయిన రాందాస్ తన బాధను వ్యక్తం చేస్తూ సెల్పీ వీడియో విడుదల చేశాడు.

మంత్రి నారా లోకేష్ తమ సమస్యను పరిష్కరించాలని వీడియోలో వేడుకున్నాడు. అప్పుల భారంతో పూర్వీకుల నుండి సంక్రమించిన ఆస్తిని విక్రయించుకోవాలనుకున్నా సాధ్యం కావడం లేదని, స్థానిక రాజకీయ నాయకులు జోక్యం చేసుకొని ఇబ్బందులు పెడుతున్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే రాందాస్ ఆరోపణలపై మాచర్ల పట్టణ పోలీసులను సంప్రదించగా రెండు నెలల క్రితం రాందాస్ తమ వద్దకు వచ్చాడని అయితే సివిల్ డిస్ప్యూట్ కావడంతోనే రెవిన్యూ అధికారుల వద్దకు పంపించామని తెలిపారు. అయితే రాందాస్ ను ఇబ్బంది పెడుతున్న రాజకీయ నేతలు ఎవరూ అన్న అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే రాందాస్ సమస్య పరిష్కారం కోసం అటు రెవిన్యూ అధికారులు ఇటు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి