Luxury Car Selling: ప్రతి 10 నిమిషాలకు రూ.50 లక్షలు విలువ చేసే లగ్జరీ కారు అమ్మకం.. ఏ కంపెనీదో తెలుసా?

Luxury Car Selling: కార్లకు డిమాండ్‌ రోజురోజుకు పెరుగుతోంది. సామాన్యుడు సైతం కారు కొనుగోలు చేయాలనే ఆశలో ఉన్నాడు. ఒకప్పుడు డబ్బున్నవాళ్లు మాత్రమే కారును కొనుగోలు చేస్తుంటే ప్రస్తుతం రోజులలో సామాన్యులు సైతం కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఇక ప్రతి 10 నిమిషాలకు ఒక లగ్జరీ కారు అమ్మకం జరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి..

Luxury Car Selling: ప్రతి 10 నిమిషాలకు రూ.50 లక్షలు విలువ చేసే లగ్జరీ కారు అమ్మకం.. ఏ కంపెనీదో తెలుసా?
Follow us
Subhash Goud

|

Updated on: Dec 28, 2024 | 6:09 PM

చౌక కార్ల రోజులు ముగియబోతున్నాయా? 2024 సంవత్సరంలో లగ్జరీ కార్లకు ఉన్న డిమాండ్ కూడా అలాంటిదేనని సూచిస్తోంది. ఈ ఏడాది ప్రతి గంటకు 6 విలాసవంతమైన కార్లు అమ్ముడయ్యాయని, వీటి ధర రూ. 50 లక్షల కంటే ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అంటే ప్రతి 10 నిమిషాలకు ఒక లగ్జరీ కార్ సేల్ ఉంటుంది. ఈ కార్లలో ఆడి, మెర్సిడెస్-బెంజ్ వంటి పెద్ద బ్రాండ్‌ల కార్లు ఉన్నాయి. గణాంకాల ప్రకారం.. 5 సంవత్సరాల క్రితం ప్రతి గంటకు విక్రయించే లగ్జరీ కార్ల సంఖ్య కేవలం రెండు మాత్రమే. ఈ 5 సంవత్సరాలలో ఇది మూడు రెట్లు పెరిగింది. సంపన్న వర్గం విస్తరిస్తున్నట్లు ఇది తెలియజేస్తోంది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. లగ్జరీ కార్ల తయారీదారులు 2025 సంవత్సరంలో రెండు డజనుకు పైగా కొత్త వాహనాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Digital Scam: వాట్సాప్‌లో వచ్చిన లింక్.. ఒక్క సెకనులో రూ.6 లక్షలు పోగోట్టుకున్న యువకుడు.. బీ కేర్ ఫుల్!

2025 సంవత్సరం ఎలా ఉంటుంది?

పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 2025 సంవత్సరంలో లగ్జరీ కార్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. 2025లో లగ్జరీ కార్ల విక్రయాలు 50 వేల మార్కును దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇలా జరిగితే ఇదే మొదటిసారి అవుతుంది. ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ డిలియన్ మాట్లాడుతూ.. ‘2025లో పరిశ్రమ 8 నుండి 10% చొప్పున వృద్ధి చెందుతుందని భావిస్తున్నాము’ అని అన్నారు. ఇదిలా ఉండగా, మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంతోష్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘2025 సంవత్సరంలో లగ్జరీ కార్ల అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది’ అని అన్నారు.

2024లో పరిస్థితి ఎలా ఉంటుంది?

ఈ ఏడాది కూడా లగ్జరీ కార్ల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. 2024లో మెర్సిడెస్ బెంజ్ కార్ల విక్రయాల సంఖ్య 20 వేలకు చేరుకుంటుంది. సెప్టెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల్లో 14,379 యూనిట్ల విక్రయాల్లో 13% వృద్ధిని నమోదు చేసింది. అదే సమయంలో జనవరి, సెప్టెంబర్ మధ్య, BMW ఇండియా అమ్మకాలు దాదాపు 5% పెరిగి రికార్డు స్థాయిలో 10,556 వాహనాలకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది అమ్మకాలను మళ్లీ పెంచుకోబోతున్నట్లు ఆడి ఇండియా తెలిపింది.

లగ్జరీ కార్ల అమ్మకాలు ఎందుకు పెరుగుతున్నాయి?

దేశంలో బిలియనీర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. నైట్ ఫ్రాంక్ ‘ది వెల్త్ రిపోర్ట్ 2024’ ప్రకారం.. అల్ట్రా-రిచ్ భారతీయుల సంఖ్య 2023లో 13263 నుండి 2028లో 19908కి 50% పెరుగుతుందని అంచనా. భారతదేశం తర్వాత చైనా (47%), టర్కియే (42.9%), మలేషియా (35%) ఉన్నాయి. దేశంలో బిలియనీర్ల సంఖ్య పెరగడంతో లగ్జరీ కార్ల విక్రయాలు పెరిగాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: Anil Ambani: అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా..? దాని విలువ ఎంతంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!