Lunar Eclipse 2021: సంపూర్ణ చంద్రగ్రహణం..గ్రహణ సమయంలో ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు.. పండితులు ఏం చెబుతున్నారు?

Lunar Eclipse 2021: ఈరోజు మరికొద్ది గంటల్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఇది 2021లో మొదటి చంద్రగ్రహణం. అంతేకాదు.. ఇది సూపర్ మూన్ కూడా. అంటే, చంద్రగ్రహణం..బ్లడ్ మూన్ ఒకేసారి కనిపిస్తాయి.

Lunar Eclipse 2021: సంపూర్ణ చంద్రగ్రహణం..గ్రహణ సమయంలో ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు.. పండితులు ఏం చెబుతున్నారు?
Lunar Ecilipse 2021
Follow us
KVD Varma

|

Updated on: May 26, 2021 | 1:17 PM

Lunar Eclipse 2021: ఈరోజు మరికొద్ది గంటల్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఇది 2021లో మొదటి చంద్రగ్రహణం. అంతేకాదు.. ఇది సూపర్ మూన్ కూడా. అంటే, చంద్రగ్రహణం..బ్లడ్ మూన్ ఒకేసారి కనిపిస్తాయి. బ్లడ్ మూన్ అంటే చంద్రుడు ఎర్రగా కనిపించడం. సాధారణంగా పూర్తి గ్రహణంలో సూపర్ మూన్ ఒకసారి.. బ్లడ్ మూన్ ఒకసారి వేర్వేరుగా కనిపిస్తాయి. కానీ ఈరోజు సంభవించే చంద్రగ్రహణంలో మాత్రం రెండూ ఒకేసారి కనిపించనున్నాయి. అయితే, ఈ చంద్రగ్రహణం మన దేశంలో పాక్షికంగా మాత్రమే కనిపిస్తుంది. అదీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే గ్రహణం కొద్ది సేపు కనిపిస్తుంది. ఈ గ్రహణం ముగిపు సమయంలో మన దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లోనూ..పశ్చిమ బెంగాల్, ఒడిశా అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవుల లోను స్వల్ప సమయం చంద్రగ్రహణం కనిపించే అవకాశం ఉంది.

ఇక గ్రహణాలు సైన్స్ పరంగా ఒక ఖగోళ విశేషంగా చెప్పుకుంటారు. ఖగోళ శాస్త్రజ్ఞులు గ్రహణాల సమయంలో విస్తృతంగా పరిశోధనలు చేస్తారు. ఆ సమయంలో వచ్చే అనేక మార్పులను పరిశోధిస్తారు. నిజానికి వారు చాలా రకాలైన పరిశోధనల కోసం గ్రహణ సమయాలను ఎంచుకుంటారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రజ్ఞులు గ్రహణ సమయాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇక మనదేశంలోనూ గ్రహణ సమయాలను ఆసక్తిగా గమనిస్తారు. మన ప్రజలలో చలా మంది గ్రహణం విషయంలో చాలా కచ్చితమైన నియమాలు పాటిస్తారు. గ్రహణ విషయాల్లో చాలా నియమాలు మనదేశంలో పాటిస్తారు. గ్రహణం పట్టు విడుపు కూడా వారికీ పట్టింపే. గ్రహణం వస్తే గ్రహణ సూతకం పాటిస్తారు. వారి దృష్టిలో గ్రహణం సమయంలో భూమిపై వాతావరణం కలుషితం అవుతుంది. అదేవిధంగా ఎన్నో దుష్ఫలితాలు…దుష్ప్రభావాలు మనుషుల మీద పడే అవకాశం ఉందని నమ్ముతారు. అందుకే మన దేశంలో గ్రహణాలు ఏర్పడేటప్పుడు ప్రారంభం నుంచి పూర్తి అయ్యేవరకూ ఇంటి నుంచి బయటకు కదలకుండా ఉండాలని చెబుతారు. అంతేకాదు.. గ్రహణ సమయంలో ఏమీ తినకూడదని కూడా చెబుతూ ఉంటారు.

గ్రహణ సమయంలో ఏమి చేయకూడదు..

గ్రహణ సూతక సమయంలో అన్ని రకాల ఆహార పదార్థాలను ఘన రూపంగా లేదా ద్రవం రూపంగా తినడం నిషేధించబడింది. అయితే, పిల్లలు, జబ్బుపడిన మరియు వృద్ధులు అవసరమైతే ఈ సమయంలో తినవచ్చు అని చెబుతారు. ఇక గ్రహణ సమయంలో ఎవరినీ బయటకు వెళ్ళవద్దంటారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్లవద్దని ఖచ్చితంగా సలహా ఇస్తారు. గ్రహణం సమయంలో కలుషితమైన వాతావరణానికి గురికావడం శిశువు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని అలాగే, గర్భస్రావం సంభావ్యత పెరుగుతుందని నమ్ముతారు.

మన ఆచారాల ప్రకారం గహ్రణ సమయంలో చమురు మసాజ్ చేసుకోవడం, మంచినీరు తాగడం, మలమూత్ర విసర్జన, జుట్టు దువ్వుకోవడం, పళ్ళు తోముకోవడం అదేవిధంగా లైంగిక చర్యలలో పాల్గొనడం మంచిది కాదని చెబుతారు. ఈపనులను చేయడం వల్ల ఇబ్బందులు పడతారని పండితులు చెబుతూవస్తారు.

గ్రహణం తరువాత ఏమి చేయాలి?

గ్రహణం కంటె ముందు సమయంలో తయారుచేసిన ఆహారాన్ని పూర్తిగా పారవేయాలి. గ్రహణ సమయంలో ఇంట్లో మిగిలిన ఆహార పదార్ధాలను తినడం ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని పండితులు చెబుతారు. గ్రహణం పట్టే ముందు స్నానం చేయాలి. ఒకవేళ అప్పుడు చేయకపోయినా గ్రహణం ముగిసాకా వెంటనే స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేయాలి. తరువాత తాజా ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి. దర్భ గడ్డి లేదా తులసి ఆకులను గోధుమలు, బియ్యం, ఇతర తృణధాన్యాలు అలాగే కూరగాయలు వంటి ఆహార పదార్థాల కంటైనర్లలో ఉంచాలి. అలాగే, గ్రహణం తర్వాత దానాలు చేయడం చాలా ప్రయోజనకరంగా పండితులు చెబుతారు.

గ్రహణం సమయంలో ఈ మంత్రం జపిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు..

తమోమయ మహాభీమ సోమసూర్యవిమర్దనా హేమతప్రదనేన మామా శాంతిప్రాడో భవ విధుంటూడ నమస్తుభ్య సింహికానందనాచ్యుత దనేననేనా నాగస్య రక్ష మామ్ వేదాజద్భయత్

ఈరోజు ఏర్పడుతున్న చంద్ర  గ్రహణం ఎక్కడెక్కడ ఏ సమయాల్లో కనిపిస్తుంది?

మే 26 న మొత్తం చంద్ర గ్రహణం సంభవిస్తుంది, అయితే ఇది ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్ లోని కొన్ని ప్రాంతాలు, ఒడిశా తీర ప్రాంతాలు మరియు అండమాన్ మరియు నికోబార్ దీవుల నుండి స్వల్ప కాలానికి దేశంలో కనిపిస్తుంది. దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం మరియు హిందూ మహాసముద్రం విస్తరించి ఉన్న ప్రాంతంలో గ్రహణం పూర్తిగా కనిపిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. “భారతదేశం నుండి, చంద్రోదయం తరువాత, గ్రహణం యొక్క పాక్షిక దశ ముగింపు ఈశాన్య భాగాలు (సిక్కిం మినహా), పశ్చిమ బెంగాల్ లోని కొన్ని ప్రాంతాలు, ఒడిశా మరియు అండమాన్ మరియు నికోబార్ దీవుల యొక్క కొన్ని ఖరీదైన భాగాల నుండి కొద్దిసేపు కనిపిస్తుంది.” భారత వాతావరణ శాఖ తెలిపింది.

గ్రహణం యొక్క పాక్షిక దశ మధ్యాహ్నం 3.15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.23 గంటలకు ముగుస్తుంది, మొత్తం దశ సాయంత్రం 4.39 గంటలకు ప్రారంభమై 4.58 గంటలకు ముగుస్తుంది. సాయంత్రం 5.38 నుండి పోర్ట్ బ్లెయిర్ నుండి గ్రహణాన్ని 45 నిముషాల పాటు చూడవచ్చు. సాయంత్రం 6.21 నుండి పూరి మరియు మాల్డా నుండి చూడవచ్చు కాని రెండు నిమిషాలు మాత్రమే చూడవచ్చు.

తదుపరి చంద్ర గ్రహణం నవంబర్ 19 న భారతదేశం నుండి కనిపిస్తుంది. ఇది పాక్షిక చంద్ర గ్రహణం అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం యొక్క తీవ్ర ఈశాన్య ప్రాంతాల నుండి చంద్రోదయం అయిన కొద్దిసేపు ఈ పాక్షిక దశ ముగింపు కనిపిస్తుంది.

Also read: Buddha Purnima 2021: బుద్ధ పౌర్ణమి తేదీ, శుభ ముహుర్తం.. వైశాఖ పూర్ణిమ ప్రాముఖ్యత వివరాలు..

మొఘల్ చక్రవర్తి అక్బర్ కారణంగానే హనుమాన్ చాలీసా రాశారా ? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసా..