AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇష్టం లేని పెళ్లి చేశారని.. ఓ ప్రేమ జంట ఆత్మహత్య

కర్ణాటకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన అమ్మాయిని కాదని, మరొకరితో వివాహం చేశారని మనోవేధనకు గురై.. ప్రియురాలితో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు ఓ ప్రేమికుడు.

ఇష్టం లేని పెళ్లి చేశారని.. ఓ ప్రేమ జంట ఆత్మహత్య
Balaraju Goud
|

Updated on: Sep 03, 2020 | 8:28 AM

Share

కర్ణాటకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన అమ్మాయిని కాదని, మరొకరితో వివాహం చేశారని మనోవేధనకు గురై.. ప్రియురాలితో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు ఓ ప్రేమికుడు.

ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేశారు. కాదు కూడదన్న పేరేంట్స్ ససేమిరా అని అబ్బాయికి మరో అమ్మాయితో వివాహం జరిపించారు. దీంతో తాను ప్రేమించిన యువతితో కాకుండా మరో యువతితో పెద్దలు వివాహం చేయడంతో యువకుడు తన ప్రియురాలితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన క్రిష్ణగిరి జిల్లా కేంద్రం సమీపంలో చోటు చేసుకుంది.

క్రిష్ణగిరి జిల్లా వేపనపల్లి సమీపంలోని కే. కొత్తూరు గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ సురేష్‌(24), బొమ్మరసనపల్లి గ్రామానికి చెందిన బాలరాజ్‌ కూతురు భవాని(18)లు ఏడాదిగా ప్రేమించుకున్నారు. అయితే, సురేష్‌ కుటుంబ సభ్యులు వీరి ప్రేమపై అయిష్టత వ్యక్తం చేస్తూ నాలుగు నెలల క్రితం సురేష్‌కు వేరే యువతితో పెళ్లి జరిపించారు. ఇష్టం లేని పెళ్లి జరగడంతో సురేష్‌ రెండు రోజుల క్రితం తన ప్రేయసితో కలిసి ఇల్లు వదిలి వెళ్లి పారిపోయారు. కాగా, హోసూరు– క్రిష్ణగిరి జాతీయ రహదారిలోని కుందారపల్లి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇది గమనించిన స్థానికులు వారిని క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ భవానీ మంగళవారం మృతి చెందింది. సురేష్‌ను మెరుగైన చికిత్స కోసం కోలారుకు తరలించగా మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై క్రిష్ణగిరి తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.