కారు బీభత్సం… ప్రేమజంట దుర్మరణం..

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ లో జాతీయ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ రోడ్డు ప్రమాదంలో ప్రేమ జంట దుర్మరణం పాలైంది.

  • Balaraju Goud
  • Publish Date - 4:43 pm, Mon, 12 October 20
కారు బీభత్సం... ప్రేమజంట దుర్మరణం..

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ లో జాతీయ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ రోడ్డు ప్రమాదంలో ప్రేమ జంట దుర్మరణం పాలైంది. పెళ్లి చేసుకొనేందుకు ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

చౌటుప్పల బస్ స్టేషన్ ప్రాంతంలో హైద్రాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తున్న బ్రిజా కార్ బ్రేక్ ఫైల్ అవ్వటం తో ఓ కారుతో పాటు నాలుగు వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో యాక్టివా వాహనంపై వెళ్తున్న యువతి అక్కడిక్కడే మరణించగా నాగరాజు అనే వ్యక్తితో చికిత్స నిమిత్తం హైద్రాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.. ఈ ఘటనలో మరో నాలుగురికి గాయాలయ్యాయి.

రంగారెడ్డి జిల్లా మన్నెగూడకు చెందిన నాగరాజు, మరో యువతి పెళ్లి చేసుకొనేందుకు యాక్టివా వాహనంపై ఇవాళ చెర్వుగట్టుకు బయలుదేరారు. చౌటుప్పల్ వద్దకు రాగానే ఈ ప్రేమజంట వెళ్తున్న వాహనాన్ని వెనుక నుండి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో స్కూటీ రోడ్డుపైనే పల్టీ కొట్టింది. స్కూటీపై ఉన్న యువతి, యువకుడు రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో స్కూటీ నుండి పెట్రోల్ లీకై దగ్దమైంది. స్కూటీపై ప్రయాణీస్తున్న యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.