పిల్లి పిల్ల‌ అనుకుని కొన్నారు..తీరా రెండేళ్ల తర్వాత..!

తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే తప్పు. తప్పుకు శిక్ష తప్పదు...అదే విధంగా పొరపాటుకు కూడా కొన్నిసార్లు మూల్యం చెల్లించక తప్పదు.

  • Ram Naramaneni
  • Publish Date - 4:45 pm, Mon, 12 October 20
పిల్లి పిల్ల‌ అనుకుని కొన్నారు..తీరా రెండేళ్ల తర్వాత..!

తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే తప్పు. తప్పుకు శిక్ష తప్పదు…అదే విధంగా పొరపాటుకు కూడా కొన్నిసార్లు మూల్యం చెల్లించక తప్పదు. తాజాగా ప్రాన్స్‌కు చెందిన ఓ జంట తమకు తెలియకుండా చేసిన ఓ తప్పిదం వల్ల జైలుపాలయ్యారు.

ఫ్రాన్స్‌లోని నార్మండీ ప్రాంతం లి హ‌వ్రెకు చెందిన ఓ కపుల్ 2018లో ఆన్‌లైన్‌లో ఓ అడ్వర్టైజ్‌మెంట్ చూశారు. స‌వానా జాతికి చెందిన పిల్లి పిల్ల‌ను విక్రయిస్తామంటూ యాడ్‌లో పేర్కొన్నారు. దీంతో ఆ పిల్లి పిల్లను చూసిన ముచ్చటపడిన సదరు జంట 6వేల యూరోలు (దాదాపుగా రూ.5.18 ల‌క్ష‌లు) వెచ్చించి ఆన్‌లైన్‌లో పిల్లి పిల్ల‌ను కొన్నారు. రెండు సంవత్సరాల తర్వాత అది పిల్లి కాదు అరుదైన జాతికి చెందిన పులి అని తెలియడంతో షాక్‌కు గురయ్యారు. దాదాపు 2 ఏళ్ల పాటు వారి దాన్ని ప్రేమతో సాకారు. కానీ ఎదుగుతున్నకొద్ది దానిలో పిల్లి లక్షణాలు కనిపించడం లేదు. దీంతో పోలీసులను అప్రోచ్ అయ్యారు. వారు నిపుణులను తీసుకొచ్చి పరిశీలించగా, అది సుమ‌త్రా దీవుల్లో ఉండే అరుదైన జాతికి చెందిన పులి అని తేలింది. వాస్తవానికి ఆ కపుల్‌కి అది పులి అని తెలియదు. అయినప్పటికీ వారిని నేరస్థులుగానే పరిగణిస్తూ అరెస్ట్ చేశారు. ఆ దంపతులతో సహా మొత్తం 9 మందిని ఈ కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకున్నారు.  ఈ పులి ప్ర‌స్తుతం అంత‌రించి పోతున్న జీవుల జాబితాలో ఉందట. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ పులులు కేవ‌లం 400 మాత్ర‌మే ఉన్నాయ‌ని డ‌బ్ల్యూడ‌బ్ల్యూఎఫ్ వెల్ల‌డించింది. అయితే ప్ర‌స్తుతం ఆ పులి ఆరోగ్యంగానే ఉంద‌ని దాన్ని ఫ్రెంచ్ బ‌యోడైవ‌ర్సిటీ కార్యాలయానికి  త‌ర‌లించామ‌ని పోలీసులు వివరించారు. (మండిపోతున్న కూరగాయల ధరలు )