Telugu News Latest Telugu News Lottery organizers are trying to locate the person who won ten crores in the lottery Telugu Viral News
Trending: ఫాఫం బ్యాడ్ లక్ అంటే ఇతనిదే బాసూ.. లాటరీలో పది కోట్లు గెలుచుకున్నాడు.. ఆచూకీ లేకుండా పోయాడు
అదృష్టం అనేది ప్రతి ఒక్కరినీ వరిస్తుంది. తొందరగానో, కాస్త ఆలస్యంగానో ఎప్పుడో ఒకసారి ఒక సారి పలకరిస్తుంది. అయితే దానిని గుర్తించినవారే నిజమైన అదృష్టవంతులు. సాధారణంగా చాలా మంది లాటరీ కొంటూ ఉంటారు. ఏదో ఒక రోజు లాటరీ..
అదృష్టం అనేది ప్రతి ఒక్కరినీ వరిస్తుంది. తొందరగానో, కాస్త ఆలస్యంగానో ఎప్పుడో ఒకసారి ఒక సారి పలకరిస్తుంది. అయితే దానిని గుర్తించినవారే నిజమైన అదృష్టవంతులు. సాధారణంగా చాలా మంది లాటరీ కొంటూ ఉంటారు. ఏదో ఒక రోజు లాటరీ తగలకపోదా.. అదృష్టం వరించదా అని అనుకుంటూ ఉంటారు. అలా లాటరీ కొన్న వారిలో ఒక్కరికి మాత్రమే లాటరీ సొంతమవుతుంది. లాటరీలో ఏ చిన్న బహుమతి గెలిచినా చాలా ఆనందంగా ఫీలవుతారు. అలాంటిది ఓ వ్యక్తి లాటరీలో ఏకంగా రూ.కోట్లు గెలుచుకున్నాడు. కానీ దాన్ని పొందే అదృష్టానికి నోచుకోలేకపోయాడు. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో మెగా మిలియన్స్ లాటరీ నిర్వహిస్తుంటారు. జులై 29న రూ.134 కోట్ల డాలర్ల విలువైన లాటరీ డ్రా తీశారు. ఇందులో ఓ వ్యక్తి ఏకంగా 10,716.18 కోట్లు గెలుచుకున్నాడు. బహుమతి గెలుచుకున్న లాటరీ టికెట్ల నంబర్లను ప్రకటించారు. కాగా.. ఆ లాటరీ టికెట్ ను కొనుగోలు చేసినవారు లాటరీ నిర్వాహకులను సంప్రదించకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో లాటరీ నిర్వాహకులు షాక్ అయ్యారు. లాటరీ విజేతలు తమను సంప్రదించాలని ప్రకటించారు.
? ? ? Winner Alert: Mega Millions® players, check your ticket! A lucky winner won $1,280,000,000! If you purchased your ticket from Speedway in Des Plaines, IL, you could be the winner! https://t.co/AidZEHZGHcpic.twitter.com/Jus6gwQTMY
కాగా.. ఈ లాటరీ గెలుచుకున్న నంబర్ల సిరీస్ 13, 36, 45, 57, 67, 14 అని.. చికాగో నగర శివార్లలోని ఓ పెట్రోల్ బంక్ లో ఈ లాటరీ టికెట్ అమ్ముడైందని నిర్వాహకులు తెలిపారు. అమెరికాలో ఏ లాటరీకైనా విజేతలు బహుమతిని క్లెయిమ్ చేసుకోవడానికి రెండు నెలల వరకు మాత్రమే సమయం ఉంటుంది. మెగా మిలియన్ లాటరీకి 180 రోజులు గడువు ఉంటుంది. అయితే తాజాగా ఈ లాటరీ గెలుచుకుని రోజులు అవుతున్నా విజేతలు నగదు క్లెయిమ్ చేసుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో విజేతలు త్వరగా ముందుకు రావాలంటూ ఆ కంపెనీ ప్రకటన కూడా జారీ చేసింది. చూడాలి మరి.. ఆ విజేత లాటరీ డబ్బు తీసుకునేందుకు వస్తాడో లేదో…