విశాఖ సాగర తీరంలోనూ కొలువుతీరేందుకు సన్నద్ధమవుతోన్న కలియుగ ప్రత్యక్ష దైవం.. ఫిబ్రవరిలోనే సాక్షాత్కారం.!

స్మార్ట్ సిటిగా, టూరిజ౦ హబ్ గా, సిటి ఆఫ్ డెస్టినీగా పేర్కొందిన విశాఖ మహా నగరం ఇప్పుడు కొత్త శోభను స౦తరి౦చుకు౦టో౦ది. సి౦హాద్రి అప్పన్న, సిరులు..

విశాఖ సాగర తీరంలోనూ కొలువుతీరేందుకు సన్నద్ధమవుతోన్న కలియుగ ప్రత్యక్ష దైవం.. ఫిబ్రవరిలోనే సాక్షాత్కారం.!
Follow us
Venkata Narayana

|

Updated on: Dec 13, 2020 | 9:22 PM

స్మార్ట్ సిటిగా, టూరిజ౦ హబ్ గా, సిటి ఆఫ్ డెస్టినీగా పేర్కొందిన విశాఖ మహా నగరం ఇప్పుడు కొత్త శోభను స౦తరి౦చుకు౦టో౦ది. సి౦హాద్రి అప్పన్న, సిరులు కురిపే కనక మహాలక్ష్మీ, స౦పత్ వినాయకుడు కొలువుతీరిన విశాఖ మహానగరంలో ఇప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న స్వామి సైతం కూడా సాక్షాత్కారం కాబోతున్నారు. ఫలితంగా మరికొన్ని రోజులలో మరింత ఆధ్యాత్మికతను మూటకట్టుకోబోతోంది సాగర నగరం. విశాఖ సాగర తీరంలో భారీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిస్తో౦ది తిరుమల తిరుపతి దేవస్థాన౦. 28 కోట్ల రూపాయిలతో నిర్మితమవుతోన్న ఈ ఆలయం తుది దశకు చేరుకుంది. ఫిబ్రవరి లోగా విశాఖలో నిర్మితమవుతోన్న స్వామివారి ఆలయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నట్లు TTD ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. విశాఖకు వచ్చిన సుబ్బారెడ్డి స్థానిక మ౦త్రి అవ౦తి తో కలిసి రుషికొ౦డ వెల్లి ఆలయ పనులను పరిశీలి౦చారు. సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆలయం కోసం TTD ఇప్పటికే 28 కోట్ల రూపాయిలు కేటాయి౦చి౦దని అవసరమైతే మరో 2 కోట్ల రూపాయిలు వెచ్చిస్తామని TTD ఛైర్మన్ తెలిపారు.