AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramatheertham Updates: నేతల పర్యటన, కార్యకర్తల ఆందోళనలు .. రాజకీయ రణక్షేత్రంగా రామతీర్థం..

రామతీర్థం శ్రీకోదండరామాలయం వద్ద హైటెన్షన్‌ కొనసాగింది. మూడు పార్టీల ఆందోళనలతో హోరెత్తుతోంది.

Ramatheertham Updates: నేతల పర్యటన, కార్యకర్తల ఆందోళనలు .. రాజకీయ రణక్షేత్రంగా రామతీర్థం..
Balaraju Goud
| Edited By: Ram Naramaneni|

Updated on: Jan 03, 2021 | 4:19 PM

Share

Ramatheertham Incident: రాములోరి క్షేత్రం రామతీర్థంలో క్షణక్షణం పరిణామాలు మారిపోతున్నాయి. పూలు పడాల్సిన చోట… రాళ్లు, చెప్పులు పడ్డాయి. రామనామ స్మరణ జరగాల్సిన చోట… రాజకీయ నినాదాలు మిన్నంటాయి. సంకీర్తనలు జరగాల్సిన ప్రాంతం… పొలిటికల్‌ స్పీచ్‌లతో దద్దరిల్లింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు రామతీర్థం రణతీర్థంగా మారింది.

శతాబ్దాల చరిత్ర ఉన్న… విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం శ్రీకోదండరామాలయం వద్ద హైటెన్షన్‌ కొనసాగింది. డిసెంబరు 29వ తేదీన రామతీర్థ క్షేత్రంలో… కొండపై వెలిసిన ఆలయంలోని దుండగులు రాముడి విగ్రహం తలను విరగ్గొట్టి.. ఎత్తుకుపోయారు. దీంతో అధికార పార్టీతో సహా తెలుగుదేశం, బీజేపీ పార్టీలు విడివిడిగా మూడు టెంట్‌లు వేసి నిరసన తెలపడం… ముగ్గురు నేతలు అక్కడకు రావడంతో ఉద్రిక్తత నెలకొంది.

ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం ఉదయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం చేరుకుని, కోదండ స్వామి ఆలయ పరిసరాలను పరిశీలించారు. విగ్రహ ధ్వంసం ఘటన గురించి అధికారులు, అర్చకుల దగ్గర వివరాలు అడిగి తెలుసుకున్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Jan 2021 04:00 PM (IST)

    ఏ ఘటన జరిగినా వైసీపీకి అంటగడుతున్నారు : అంజాద్ బాషా

    రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా వైసీపీ నాయకులపై, ప్రభుత్వంపై నెడుతూ టీడీపీ టీడీపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆరోపించారు. విజయనగరంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికే.. చంద్రబాబు రామతీర్థం వచ్చారని ఆయన ఆరోపించారు. నందం సుబ్బయ్య హత్య కేసులో ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం దారుణమని చెప్పారు.

  • 03 Jan 2021 03:48 PM (IST)

    రాజకీయంగా ఎదుర్కోలేకే..మతాల మధ్య చిచ్చు: హోం మంత్రి సుచరిత

    విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసంపై పొలిటికల్ వార్ కొనసాగుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. దేవాలయాలను పరిరక్షించడానికి, దాడులను అడ్డుకోవడానికి జగన్ సర్కార్ ఎంతో నిబద్దతో పనిచేస్తోందని చెప్పారు. రాజకీయంగా మునిగిపోతున్నామన్న కుళ్లుతో  చంద్రబాబు, నారా లోకేష్, ఇతర టీడీపీ నేతలు ఇలా దొడ్డిదారిన ఆలయాలపై దాడులకు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. వరసగా ఆలయాలపై దాడులు జరగడం వెనుక రాజకీయ కారణాలు, కుట్ర ఉందనే అనమానాలను వ్యక్తం చేశారు. మతాల మధ్య చిచ్చు పెడుతూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉపెక్షించబోమని అన్నారు.

  • 03 Jan 2021 03:25 PM (IST)

    ఆంధ్రప్రదేశ్‌లో మత రాజకీయాలు వద్దు : సీపీఐ నారాయణ

    ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు  మత రాజకీయాలు లేవని..వాటిని విస్తరించవద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. ఆలయ ఘటనలపై రాజకీయాలు చేయొద్దని ఆయన పార్టీలకు సూచించారు. రాష్ట్రంలో బోట్లు రాజకీయం నడుస్తుందని..ఈ చర్యల వల్ల బీజేపీకే ఉపయోగమన్నారు.  రైతుల ఆందోళనను పక్కదారి పట్టించేందుకే బీజేపీ, ఆర్ఎస్ఎస్ మత సమస్యలను సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు మరణిస్తే పట్టించుకోకుండా..ఈ రాజకీయమేంటని ప్రశ్నించారు.

  • 03 Jan 2021 03:19 PM (IST)

    బాధ్యులను ఇప్పటి వరకూ ఎందుకు అరెస్ట్‌ చేయలేదు : పవన్‌ కల్యాణ్‌

    రాష్ట్రంలో దేవతా మూర్తుల విగ్రహాల ధ్వంసం వ్యవహారం చిలికి..చిలికి గాలివానగా మారింది. తాజాగా ఈ ఘటనపై స్పందించారు జనసేనాని పవణ్ కళ్యాణ్.  పాకిస్థాన్‌లోనే ఆలయాల ధ్వంసం గురించి చదువుతున్నామని.. కాని ఇప్పుడు రాష్ట్రంలో ఆలయాల ధ్వంసం జరగడం బాధ కలిగించిందని చెప్పారు. దేవుడి విగ్రహం ధ్వంసంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారన్నారు. దేవుడిపై భారం వేయడం సీఎం జగన్ ఉదాసీనతనని ఆరోపించారు.  అధికార పక్షం చేతుల్లోనే పోలీస్‌, నిఘా విభాగాలు ఉంటాయి..ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యక్తులు ఇలాంటి తప్పులు చేస్తే..ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నించారు. బాధ్యులను ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలన్నారు.

  • 03 Jan 2021 03:11 PM (IST)

    రోజుకో దేవుడి విగ్రహం ధ్వంసం : అచ్చెన్నాయుడు

    రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఓ రేంజ్‌లో మాటల యుద్ధం‌ జరుగుతోంది. తాజాగా రాముడి విగ్రహం ధ్వంసం హిందూ మతంపై దాడేనన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. వైసీపీ పాలనలో రోజుకో విగ్రహం ధ్వంసమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 19 నెలల పాలనలో దేవాలయాలు, దేవుళ్లపై 126 దాడులు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పవిత్రతను మంటగల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ ఆస్తుల అమ్మకంపై ఉన్న శ్రద్ధ.. దేవాలయాల పరిరక్షణపై ఎందుకు లేదని ప్రశ్నించారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ జరుపుతామని.. హామీ ఇచ్చి ఎందుకు జరపలేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

  • 03 Jan 2021 03:01 PM (IST)

    విగ్రహం ధ్వంసం వెనుక చంద్రబాబు కుట్ర: కొడాలి నాని

    రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం అంశంపై అధికార, ప్రతిపక్షాల ఓ రేంజ్‌లో మాటల యుద్దం జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు సహా బీజేపీ, జనసేన నేతలు ప్రభుత్వం దేవాలయాలపై దాడుల విషయం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ఆరోపణలు గుప్పించారు.  రామతీర్థం ప్రస్తుతం రణరంగంగా మారింది. శనివారం వైసీపీ ఎంపీ విజయ సాయి, టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్..రామతీర్థంలో వేరువేరుగా పర్యటించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకుంది. తాజాగా ఈ ఘటనపై మంత్రి కొడాలి నాని స్పందించారు.

    రామతీర్థంలో నూటికి నూరుశాతం విగ్రహాన్నీ ధ్వంసం చేయించింది చంద్రబాబే అని తెగేసి చెప్పారు నాని. బాబుతో పాటుగా, లోకేష్, అశోక్ గజపతిరాజు, స్థానిక టీడీపీ నాయకులకు నార్కో ఎనాలసిస్ టెస్టులు చేయిస్తే నిజాలు బయటపడతాయన్నారు.దేవుడులాంటి ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, దేవుడు అన్నా, ప్రజాస్వామ్యం అన్నా నమ్మకం లేదని పేర్కొన్నారు. స్వార్థ రాజకీయాల కోసమే  రామతీర్థంలో చంద్రబాబు  పర్యటించారని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో గుళ్ళను కూల్చి, చెత్త ట్రాక్టర్లలో దేవుళ్ళ విగ్రహాలను డంపింగ్ యార్డ్‌ల్లో పడేసిన చరిత్ర చంద్రబాబుదని ఆరోపించారు.

  • 03 Jan 2021 02:48 PM (IST)

    శ్రీరాముడి విగ్రహం ధ్వంసం చాలా బాధ కలిగించింది: సోము వీర్రాజు

    రాష్ట్ర వ్యాప్తంగా గుడులు, దేవుళ్లపై దాడులు పెరిగిపోయాని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆరోపించారు. శ్రీరాముడి విగ్రహం ధ్వంసం చాలా బాధ కలిగించిందన్నారు. రామతీర్థం అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులను అరెస్ట్ చేయాల్సిన పోలీసులు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. దోషులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సోమువీర్రాజు చెప్పారు. బీజేపీ-జనసేన 5వ తేదీన చలో రామతీర్థానికి పిలుపునిచ్చినట్లు వివరించారు.

  • 03 Jan 2021 02:45 PM (IST)

    దేవాలయాల పరిరక్షణ కోసం పోరాటంః బుద్దా వెంకన్న

    రామతీర్ధం ఘటన చాలా దురదృష్టకరమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆదోళన వ్యక్తం చేశారు. ఏపీలో దేవుళ్ళకే రక్షణ లేకుండా పొయిందని విమర్శించారు. దాడులను ఖండించకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు.

  • 03 Jan 2021 02:42 PM (IST)

    దేవాలయాల ఘటనలపై నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు

    ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. రాముడి విగ్రహం తలను విరగ్గొట్టడంతో పలు రాజకీయ పార్టీలు వేటికవే నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఆలయం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పోలీసులు నిందితుల వేటలో ఉన్నారు. అయితే ఈ ఘటనపై తాజాగా దీనిపై సినీ నటుడు సుమన్ కూడా స్పందించారు.

    విగ్రహాలను ఎవరు ధ్వంసం చేశారో నిర్ధారణకు రాకుండా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై నిందలు వేయడం తగదన్నారు. సీఎం జగన్‌కు చెడ్డపేరు తీసుకురావడానికి ప్రతిపక్ష నాయకులే ఆ విగ్రహాల ధ్వంసానికి పాల్పడి ఉంటారని ఆరోపించారు. నిందితులను గుర్తించకుండా ఒకరిమీద మరొకరు నిందలు వేయడం సరైన పద్ధతికాదన్నారు. హిందువుల మనోభావాలను దృష్టి పెట్టుకుని సీఎం జగన్ దేవాలయాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారని పేర్కొన్నారు. ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షించాలని ప్రధాని నరేంద్రమోదీని కోరారు.

  • 03 Jan 2021 02:18 PM (IST)

    దేవుడి వద్ద రాజకీయాలు చేయడం సరికాదుః బొత్స

    మేడ్చల్ జిల్లాలో దారుణం జరిగింది. నిత్యం మద్యం మత్తులో వేధిస్తున్న భర్తను వదిలించుకోవలనుకుంది. తాళి కట్టిన భర్తనే కడతేర్చింది ఓ భార్య. కీసర పోలీస్ స్టేషన్ పరిదిలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక విజయ హాస్పిటల్ ఎదురుగా ఉన్న స్థలంలో శ్యామ్, సరోజ దంపతులు వాచ్‌మెన్ జీవనోపాధి సాగిస్తున్నారు. భర్త శ్యామ్ రోజు మద్యం సేవించి భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇదే క్రమంలో ఇద్దరి మధ్య ఇవాళ తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆవేశానికి లోనైన భార్య..చివరకు భర్తను హతమార్చింది. రోకలితో భర్త శ్యామ్ తలపై బలంగా మోదడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • 03 Jan 2021 01:23 PM (IST)

    దాడిపై పోలీసులకు విజయసాయిరెడ్డి ఫిర్యాదు

    రామతీర్థం వద్ద శనివారం కొందరు టీడీపీ కార్యకర్తలు రాళ్లు, వాటర్‌ ప్యాకెట్లతో తనపై దాడి చేశారని, చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావుల డైరెక్షన్‌లోనే ఈ దాడి జరిగిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. టీడీపీ కార్యకర్తల దాడిలో తన గన్‌మెన్‌కు గాయాలయ్యాయని తెలిపారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదుతో నెల్లిమర్ల పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అంతకు క్రితం ఆయన ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ.. ‘‘ అను’కుల మీడియా యజమానులను కలిసేందుకు వెళ్తే బూట్లు విప్పి వంగి వంగి వినయం ప్రదర్శిస్తాడు. పూజల్లో, ఆలయ ప్రాంగణాల్లో మాత్రం పాదరక్షలు ససేమీరా విప్పేది లేదంటాడు. భక్తి గురించి, మత విశ్వాసాల గురించి ఈయన ప్రవచనాలు చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది!’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

  • 03 Jan 2021 01:12 PM (IST)

    చంద్రబాబు రాజకీయం చేస్తున్నారుః వెల్లంపల్లి

    రామతీర్థం ఘటన బాధాకరమని, దీన్ని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. బాబు హయాంలో ఆలయాలను కూల్చినప్పుడు దేవుడు గుర్తుకు రాలేదా అని మంత్రి ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు అనవసరరాద్ధాంతం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. త్వరలోనే దోషులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు.

    మతాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నారని మంత్రి ఆగ్రహించారు. దేవుడంటే నమ్మకం లేని బాబు.. ఆలయాలను కూల్చిన వ్యక్తి సాంప్రదాయాల గురించి మాట్లాడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు పాపాలు చేశారు కాబట్టే వెంకటేశ్వర స్వామి ఓడించాడని ఎద్దేవా చేశారు. ఇక, రామ తీర్థం ఘటనపై పోలీసుల విచారణ జరుగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లంపల్లి తెలిపారు. దేవుడి విగ్రహాలు ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని, ఈ ఘటన వెనక ఉన్నవారికి శిక్ష తప్పదని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.

  • 03 Jan 2021 01:08 PM (IST)

    రామతీర్థం ఆలయాన్ని పరిశీలించిన మంత్రులు

    ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం ఉదయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం చేరుకుని, కోదండ స్వామి ఆలయ పరిసరాలను పరిశీలించారు. విగ్రహ ధ్వంసం ఘటన గురించి అధికారులు, అర్చకుల దగ్గర వివరాలు అడిగి తెలుసుకున్నారు.

  • 03 Jan 2021 12:59 PM (IST)

    ఈనెల 5న బీజేపీ-జనసేన ఆధ్వర్యంలో చలో రామతీర్థం..

    రామతీర్థం ఘటనకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నిర్ణయించిందని రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు. ఈనెల 5వ తేదీన బీజేపీ-జనసేన సంయుక్త ఆధ్వర్యంలో చలో రామతీర్థంకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు హాజరు కావాలని ఆయన కోరారు. మూలవిరాట్ అయిన శ్రీరాముని శిరచ్చేదనం అత్యంత దుర్మాగమన్న వీర్రాజు.. రామతీర్థం అంశాన్ని రాజకీయం చేయాలని‌ వైసీపీ, టీడీపీ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఈ ఘటనకు పాల్పడ్డ దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు పోలీసులు కార్యకర్తలను అరెస్ట్ చేయటం దారుణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ఆలయాల‌పై దాడులు పెరిగిపోయాయన్న ఆయన, భద్రత విషయంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

  • 03 Jan 2021 12:45 PM (IST)

    పెద్ద ఎత్తున తరలివస్తున్న హైందవ సంఘాలు

    రామతీర్ధంలో విగ్రహాం ధ్వంసం ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో చలో రామతీర్థం కార్యక్రమానికి ఆదివారం పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా హిందూ సంఘాల ప్రతినిధులు రామతీర్థం చేరుకుంటున్నారు. దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. భారీగా పోలీసులను మోహరించి భద్రత కట్టుదిట్టం చేశారు. మరోవైపు నిసనకారులను పోలీసులు అడ్డుకున్నారు.

  • 03 Jan 2021 12:12 PM (IST)

    రామతీర్ధం తరలివస్తున్న హైందవ సంఘాలు

    రామతీర్ధంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. హైందవ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో చలో రామతీర్థంకు పిలుపు ఇచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా హైందవ సంఘాల ప్రతినిధులు రామతీర్థం సందర్శించనున్నారు. కాగా,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు బీజేపీ నేతలు, కార్యకర్తలు తమ నిరసన శిభిరం తొలగింపుతో ఆందోళనకు దిగుతున్నారు

  • 03 Jan 2021 12:04 PM (IST)

    రామతీర్థం ఘటనపై స్పందించిన చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు

    రామతీర్థం రాముడి విగ్రహం ధ్వంసం ఘటన సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ఘటనపై చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు స్పందించారు. రామతీర్థం ఘటనను రాజకీయం చేయడం సరికాదన్నారు. స్వామివారి విగ్రహాన్ని పడగొట్టి.. సనాతన ధర్మాన్ని అంతరించిపోదన్నారు. గతంలో ఆలయాలపై గతంలో ఎన్ని దాడులు చేసినా.. సనాతన ధర్మం చెక్కు చెదరలేదన్నారు. రామతీర్థం ఆలయ అర్చకులతో ఆయన ఫోన్లో మాట్లాడానన్నారు. ఇవాళ రేపో రామతీర్థంలో రాముడి విగ్రహం ప్రతిష్టించి వెంటనే పూజలు నిర్వహించాలని సూచించారు.

  • 03 Jan 2021 11:53 AM (IST)

    అప్రమత్తమైన ఏపీ పోలీసు శాఖ

    ఇటీవల దేవాలయాలకు సంబంధించి వరుస సంఘటనలు జరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖలు అప్రమత్తమయ్యాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇకనుంచి దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతరం నిఘా ఉంటుందన్నారు. వాటి రక్షణ కోసం ప్రత్యేకించి పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్‌కు ఆదేశించినట్లు డీజీపీ చెప్పారు. దేవాలయాలు ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మన అందరిదని, అర్చకులు పూజారులు ఆలయ నిర్వాహకులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

  • 03 Jan 2021 11:53 AM (IST)

    దైవ అపచారాల్లో కుట్ర కోణంః మంత్రి వేణుగోపాలకృష్ణ

    ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ఆస్కారం లేకపోవడంతో టీడీపీ నాయకులు దైవ నిందకు పాల్పడుతున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. రామతీర్థం ఘటనపై స్పందించిన మంత్రి.. రాష్ట్రంలో జరుగుతున్న దైవ అపచారాల్లో కుట్ర కోణముందని తేటతెల్లమవుతోందన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. విగ్రహాల ధ్వంసం కేసులో నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలియజేశారు.

  • 03 Jan 2021 11:03 AM (IST)

    దేవాలయాల్లో దాడులపై స్వరూపానంద సరస్వతీ ఆందోళన

    రామతీర్థం ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇవాళ విశాఖలో శ్రీ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్రను కలిసుకున్నారు. జరుగుతున్న పరిణామాలపై ఆయనకు వివరించారు మంత్రి. కాగా, దేవాలయాల్లో దాడులపై స్వామీ స్వరూపానందేంద్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి ఘటనలను ఏమాత్రం ఉపేక్షిస్తే దేవాదాయ శాఖ ప్రతిష్ట దిగజారుతుందని హెచ్చరించారు. రామతీర్థం ఘటనపై తక్షణం నిజనిర్ధారణ కమిటీని వేయాలని స్వామీజీ డిమాండ్ చేశారు. నివేదిక సమర్పణకు కమిటీకి కాలపరిమితిని విధించి.. నిర్ణీత సమయంలో బాధ్యులను కఠిన శిక్షించాలన్నారు. రామతీర్థంలో జరిగిన ఘటనలో వాస్తవాలను వెలికి తీయడంలో పోలీసులు విఫలమయ్యారని స్వామీజీ.

  • 03 Jan 2021 10:56 AM (IST)

    హైందవ సంఘాల జేఏసీ నేత హరిదాసులును అడ్డుకున్న పోలీసులు

    రామతీర్థంలో కొనసాగుతున్న హై టెన్షన్ కొనసాగుతుంది. దీంతో పోలీసులు కొండ వద్ద భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు పోలీసులు. మరోవైపు, ఆందోళనలు చేస్తున్న వారికి హైందవ సంఘాల ఐక్య వేదిక మద్దతు తెలిపింది. నిరసన కొనసాగిస్తున్నవారికి సంఘీభావం తెలిపేందుకు హైందవ సంఘాల జేఏసీ నేత హరిదాసులు రామతీర్థం చేరుకున్నారు. దీంతో హరిదాసులను అడ్డుకుని వెనక్కి పంపించారు పోలీసులు.

  • 03 Jan 2021 10:40 AM (IST)

    ఆలయం చైర్మన్‌ పదవుల నుంచి అశోక్‌గజపతిరాజు తొలగింపు

    ఇప్పటికే సింహాచలం వరహాలక్ష్మీనరసింహ స్వామి అలయం, మాన్సాస్‌ ట్రస్టు చైర్మన్‌ పదవుల నుంచి అశోక్‌ను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా విజయనగరం పైడితల్లి అమ్మవారి దేవస్థానం, రామతీర్థం ఆలయం, తూర్పుగోదావరి జిల్లాలోని మందపల్లి మందేశ్వర స్వామి ఆలయం చైర్మన్‌ పదవుల నుంచి కూడా అశోక్‌గజపతిరాజును తొలగిస్తూ దేవదాయ శాఖ అదేశాలిచ్చింది.

  • 03 Jan 2021 10:40 AM (IST)

    ధర్మకర్త పదవి నుంచి అశోక్‌గజపతిరాజు తొలగింపు

    రామతీర్థం ఆలయ వివాదంతో రాజకీయాలు హీటెక్కాయి. ఓ వైపు విగ్రహాల ధ్వంసంపై ప్రతిపక్షాలు నిరసనలు కొనసాగిస్తుండగా, మరోవైపు ఆలయ ధర్మకర్త మాజీ కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజుపై వేటు పడింది. అంతేకాదు రామతీర్థ ఆలయంతో పాటు మరో మూడు ఆలయాల చైర్మన్‌ పదవి నుంచి తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జాఅరీ చేసింది.

  • 03 Jan 2021 10:37 AM (IST)

    బాధ్యులపై సర్కార్ వేటు

    ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి బాధ్యులైన వారిపై ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. రామతీర్థం కోదండరామాలయం ఈవో కిశోర్‌ను హెడ్ క్వార్టర్ట్స్ కి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ధరకర్తగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజును చైర్మన్ పదవి నుంచి తొలగించింది రాష్ట్ర సర్కార్.

  • 03 Jan 2021 10:37 AM (IST)

    ఇవాళ మంత్రుల పర్యటన

    ఆంధ్రప్రదేశ్ మంత్రులు రామతీర్థంలో పర్యటించనున్నారు. మరికాసేపట్లో మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపలి శ్రీనివాస్ రామతీర్థం కొండపై విగ్రహ ధ్వంసం ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు.

  • 03 Jan 2021 10:36 AM (IST)

    బీజేపీ నేతల దీక్ష భగ్నం

    రామతీర్ధం ఘటనపై పోలీసులు దూకుడు పెంచారు. గత నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నడికుడి ఈశ్వరరావుతో పాటు మరో పది మంది కార్యకర్తలను అర్ధ రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • 03 Jan 2021 10:29 AM (IST)

    రామతీర్థంలో కొనసాగుతున్న ఉద్రిక్తత

    శనివారం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొండపైకి వెళ్లి విగ్రహాలు ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆయనకు కిందకు వచ్చే సమయంలోనే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆయన కారుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. రాళ్లు, చెప్పులతో కొట్టారు. ఈ దాడితో కారు అద్దం ధ్వంసమైంది. మరోవైపు కొండ కింద జరిగిన సభలో ప్రభుత్వ తీరుపై, సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.

Published On - Jan 03,2021 4:00 PM