కరోనాపై పోరు.. ఆ గ్రామంలో పూర్తి లాక్‌డౌన్‌…

లాక్‌డౌన్‌ విధించేందుకు ప్రభుత్వాలు జంకుతున్న వేళ తమ గ్రామంలో పూర్తిగా లాక్‌డౌన్‌ విధించుకోవాలని తెలంగాణలోని ఓ గ్రామస్తులు మూకుమ్మడి నిర్ణయం తీసుకున్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో సోమవారం గ్రామ సర్పంచ్ అంజలి శ్రీనివాస్ అధ్యక్షతన ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, పాలకవర్గ సభ్యులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దోమకొండ మండల కేంద్రానికి సమీపంలో ఉన్న బిక్కనూరు, రామాయంపేట,గంభీరావుపేట్, తుజాల్‌పూర్ గ్రామాల్లో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తమ గ్రామానికి ఈ సమస్య […]

  • Ravi Kiran
  • Publish Date - 11:09 pm, Mon, 15 June 20
కరోనాపై పోరు.. ఆ గ్రామంలో పూర్తి లాక్‌డౌన్‌...

లాక్‌డౌన్‌ విధించేందుకు ప్రభుత్వాలు జంకుతున్న వేళ తమ గ్రామంలో పూర్తిగా లాక్‌డౌన్‌ విధించుకోవాలని తెలంగాణలోని ఓ గ్రామస్తులు మూకుమ్మడి నిర్ణయం తీసుకున్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో సోమవారం గ్రామ సర్పంచ్ అంజలి శ్రీనివాస్ అధ్యక్షతన ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, పాలకవర్గ సభ్యులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దోమకొండ మండల కేంద్రానికి సమీపంలో ఉన్న బిక్కనూరు, రామాయంపేట,గంభీరావుపేట్, తుజాల్‌పూర్ గ్రామాల్లో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తమ గ్రామానికి ఈ సమస్య రాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలో భాగంగా అందరం కలిసిమెలిసి కరోనా వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు లాక్ డౌన్‌ని విధించుకోవాలని నిర్ణయించారు.

అన్ని వ్యాపార కార్యకలాపాలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగించాలని సర్పంచ్ అన్నారు. వ్యవసాయ పనుల నిమిత్తం విత్తనాల దుకాణాలు, ట్రాక్టరుకు సంబంధించి పనిముట్ల దుకాణాలు, మెడికల్ షాపులు సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటాయని తెలిపారు. సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి నిబంధనలు ప్రజలందరూ ఖచ్చితంగా పాటించాలన్నారు. మాస్క్ లేకుండా బయటకొస్తే మాత్రం రూ. 200 జరిమానా విధించాలని తీర్మానించారు. ఈ తీర్మానాలు మంగళవారం నుండి అమలులోకి వస్తాయని గ్రామ సర్పంచ్ అంజలి తెలిపారు.