Art of a child: టీచర్ చిన్నబుచ్చింది.. అమ్మ ఆలోచించింది.. వాళ్ళు ప్రోత్సహించారు..ఆరేళ్ళ చిన్నారి అద్భుత పెయింటర్ అయింది!

చిన్నారులు తమ సృజనాత్మకతను చూపించడానికి ప్రయత్నించినపుడు, దానిలోని లోపాలను ఎత్తి చూపిస్తే వారిలో నెగెటివ్ ఫీలింగ్స్ ఏర్పడతాయి. దాంతో క్రమేపీ సృజనాత్మకతను వదిలి పెట్టేస్తారు.

Art of a child: టీచర్ చిన్నబుచ్చింది.. అమ్మ ఆలోచించింది.. వాళ్ళు ప్రోత్సహించారు..ఆరేళ్ళ చిన్నారి అద్భుత పెయింటర్ అయింది!
Little Girl
Follow us

|

Updated on: Apr 24, 2021 | 4:32 PM

Art of a child: చిన్నారులు తమ సృజనాత్మకతను చూపించడానికి ప్రయత్నించినపుడు, దానిలోని లోపాలను ఎత్తి చూపిస్తే వారిలో నెగెటివ్ ఫీలింగ్స్ ఏర్పడతాయి. దాంతో క్రమేపీ సృజనాత్మకతను వదిలి పెట్టేస్తారు. కొంతమందిలో ఉండే మంచి కళ ఒక్కసారే అద్భుతాన్ని సృష్టించదు. వారు తమెన్నుకున్న కళను మెల్లగా అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించాల్సింది తల్లిదండ్రులు.. టీచర్లు. ఒక్కోసారి వారు చేసే ప్రయత్నాల్లో లోపాలు ఉండొచ్చు.. కానీ, ఆ లోపాలను సరిచేసుకునే అవకాశం వారికి ఇవ్వలే కానీ, ఒక్కసారిగా ఛ..ఇదేమీ బాలేదు.. చెత్తలా ఉంది వంటి మాటలను ప్రయోగిస్తే చిన్నారులు చిన్నబుచ్చుకుంటారు. అదీ తమ టీచర్ అలా అంటే ఇంకా వారిలో ఉత్సాహం చచ్చిపోతుంది. ఇదిగో ఈ ఆరేళ్ళ పాపను అలాగే వాళ్ళ టీచర్ నీ పెయింటింగ్ బాలేదు అంది. దాంతో ఆమె చిన్నబుచ్చుకుంది. అప్పుడు ఆ చిన్నారి తల్లి ఏం చేసిందో తెలుసా? ఈ స్టోరీ చూడండి..

యూకే లోని చెస్టర్ లో ఈ చిన్నారి ఎడీ ఉంటుంది. తన స్కూల్ ఆర్ట్ క్లబ్ కోసం ఆమె ఓ పెయింటింగ్ సిద్ధం చేసింది. అది చూసిన ఆమె టీచర్ అందులో తప్పు ఉందంటూ చెప్పింది. సహజంగానే పిల్లలు తాము చేసిన పనిని టీచర్లు మెచ్చుకోవాలని ఆశిస్తారు. కానీ, ఎడీ క్లాస్ టీచర్ ఆమె పెయింటింగ్ ను తప్పు అని కచ్చితంగా చెప్పడంతో కలత చెందింది. ఇది చూసిన ఎడీ తల్లి తన చిన్నారిని బుజ్జగించింది. ఆ ఆర్ట్ చాలా బావుందని చెప్పింది. టీచర్ పొరబడి ఉంటుంది అని సముదాయించింది. అయినా, ఎడీ చిన్నబుచ్చుకునే ఉంది. దీంతో ఆమె తల్లికి ఒక ఆలోచన వచ్చింది.. వెంటనే ఆమె ఆ పెయింటింగ్ ను ట్విట్టర్ లో షేర్ చేసింది. ఈ పెయింటింగ్ ఎలా ఉందంటూ అడిగింది. తన చిన్న తల్లికి మద్దతు ఇస్తారా అంటూ అడిగింది. అంతే ఆ ట్వీట్ ట్రేండింగ్ అయింది. ట్విట్టర్ నుంచి మంచి మద్దతు వచ్చింది. ఆ తల్లి ఏదనుకుందో అదే జరిగింది. ఆమెను నిరాశ పరచకుండా ఆ పెయింటింగ్ బావుందంటూ కామెంట్లు వచ్చాయి.

ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా దీనికి మద్దతు వచ్చింది. టేట్ ఆర్ట్ గ్యాలరీ కూడా చిన్న అమ్మాయి పనిని అభినందిస్తూ వ్యాఖ్యానించింది. దీంతో చాలా మంది తమకు పెయింటింగ్స్ కావాలంటూ ఆమెను సంప్రదించారు. అంతే, ఆ చిన్నారిలో ఉత్సాహం ఉరకలెత్తింది. ఇప్పుడు ఆ చిన్నారి ఎడీ అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తోంది. ఆమె పెయింటింగ్స్ కు బోలెడు మంది అభిమానులు ఏర్పడ్డారు. దీంతో ఈ డ్రాయింగ్ లు పంచుకోవడం కోసం తన లాంటి బుల్లి పెయింటర్లను ప్రోత్సహించడం కోసం ఒక స్థలం ఏర్పాటు చేసింది ఎడీ ఆర్ట్ పేజీ పేరుతో ఒక పేజీని ప్రారంభించింది. చూశారా.. పిల్లలను సరైన విధంగా ప్రోత్సహిస్తే కచ్చితంగా మనం గర్వపడే విధంగా ముందుకు దూసుకుపోతారు.

ఎడీ తల్లి పోస్చేట్సిన ట్వీట్లు..

Also Read: Online shopping: అమ్మడి ఆన్లైన్ షాపింగ్..60 వేలతో ఏం కొనుక్కుందో చూస్తే నెటిజన్లు నవ్వుకుంటున్నట్టే మీరూ నవ్వుకుంటారు!

మంచిర్యాల జిల్లా చెన్నూరు అడవుల్లో కొత్తపులి ‘జె1’ సంచారం.. సుమారు 200 కి.మీటర్ల వ‌ర‌కు మ‌రోదాన్ని రానివ్వకుండా