Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Online shopping: అమ్మడి ఆన్లైన్ షాపింగ్..60 వేలతో ఏం కొనుక్కుందో చూస్తే నెటిజన్లు నవ్వుకుంటున్నట్టే మీరూ నవ్వుకుంటారు!

ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ అంటే అందరికీ ఎంతో ఇష్టమైన పని. కోవిడ్ పరిస్థితులు ఎలా ఉన్నా.. మామూలుగా కూడా ఆన్లైన్ లో షాపింగ్ చేయడం చాలా మందికి ఓ సరదాగా మారిపోయింది.

Online shopping: అమ్మడి ఆన్లైన్ షాపింగ్..60 వేలతో ఏం కొనుక్కుందో చూస్తే నెటిజన్లు నవ్వుకుంటున్నట్టే మీరూ నవ్వుకుంటారు!
Chair
Follow us
KVD Varma

|

Updated on: Apr 24, 2021 | 4:21 PM

Online shopping: ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ అంటే అందరికీ ఎంతో ఇష్టమైన పని. కోవిడ్ పరిస్థితులు ఎలా ఉన్నా.. మామూలుగా కూడా ఆన్లైన్ లో షాపింగ్ చేయడం చాలా మందికి ఓ సరదాగా మారిపోయింది. సూదుల దగ్గర నుంచి సూట్ కేస్ ల వరకూ.. పెన్నుల దగ్గరనుంచి లాప్ టాప్ ల దాకా.. అంతెందుకు ఫుడ్ నుంచి బెడ్ వరకూ నిత్యం ఏది కావాలన్నా ఆన్లైన్ లోనే కొనేసుకోవడం ఎక్కువ మందికి అలవాటుగా మారిపోయింది. కొంతమంది బజారులో విండో షాపింగ్ చేసినట్టు ఆన్లైన్ లో కూడా ఎప్పుడూ కొత్త వస్తువుల కోసం వెతుకుతూనే ఉంటారు. అందుకు తగ్గట్టుగానే ఆన్లైన్ బజారులో కళ్ళు చెదిరే బొమ్మలతో వస్తువులను ప్రచారంలో పెడతారు నిర్వాహకులు. ఇక వీటిలో ఆకర్షణీయంగా కనిపించిన వాటిని ఎంత డబ్బైనా వెనుకాడకుండా కట్టేసి ఇంటికి రప్పించుకుని మురిసిపోతారు షాపింగ్ ప్రియులు. ఒక్కోసారి అలా బొమ్మలు చూసి షాపింగ్ చేస్తే.. ఇంటికి వచ్చిన వస్తువు చూసిన తరువాత మన మొహం షేప్ మారిపోతుంది. అంటే, పోరాపాటుగానో, కావాలనో వేరే వస్తువు వచ్చిందని అనుకోకండి. మనం ఆర్డర్ చేసిన వస్తువే.. ఫోటోలో చూసినపుడు కనిపించిందే.. మనదగ్గరకు వస్తుంది కానీ..దానిని ఎక్కడ ఎలా ఉపయోగించాలో అర్ధంకాని కన్ఫ్యూజ్ తెస్తుంది. ఏమిటీ, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా.. వద్దు వద్దు.. ఇది చదివితే అర్ధం అవడమే కాదు పడీ పడీ నవ్వుకుంటారు.

ఒకామె ఆన్లైన్ లో వెతుకుతుంటే ఓ మడత పెట్టె కుర్చీ ఫోటో కనిపించింది. దానిని చూసి అదేదో బావుందని ఆర్డర్ పెట్టుకుని రప్పించుకుంది. ఆ తరువాత దానిని చూస్తే ఆమెకు నవ్వు ఆగలేదు.. అది మడత పెట్టె కుర్చీ లాంటిదే.. కానీ ఓ హ్యాండ్ బాగ్. ఆమె సులభంగా తీసుకుపోయే కుర్చీ అనుకుని ఆర్డర్ చేసింది. కానీ అది ఫాషన్ వస్తువు కావడంతో ఆమె అదిరిపోయింది. ఈ విషయాన్ని చెబుతూ ఆమె ఓ విడియో ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో ఉన్న కుర్చీ బాగ్ చూసిన వారు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే, ఈ కుర్చీ బ్యాగ్ అందంగా నవ్వు తెప్పించే విధంగా ఉంది. అంతేకాకుండా దాని ధర కూడా అమ్మో అనిపించేంత ఉంది. అది కేవలం 895 డాలర్లు మాత్రమే. అంటే మన కరెన్సీలో సుమారు 61 వేల వరకూ ఉంటుంది. ఇప్పుడు మీకూ వామ్మో అనిపించడంతొ పాటు అమ్మడి షాపింగ్ పిచ్చికి పిచ్చ నవ్వు వచ్చింది కదూ. ఆ ట్వీట్ మీరూ ఇక్కడ చూడండి.

Also Read: Corona Outbreak: వచ్చే నెల మధ్యలో ఇండియాలో కరోనా విస్ఫోటనం భారీగా ఉండబోతోందా? అమెరికా పరిశోధకులు ఏం చెబుతున్నారు?

Sachin Tendulkar’s 48th Birthday: సచిన్ ను ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ అని ఎందుకు పిలుస్తారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.. Viral Video