Sachin Tendulkar’s 48th Birthday: సచిన్ ను ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ అని ఎందుకు పిలుస్తారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.. Viral Video

అందరూ బుడి బుడి అడుగులు వేస్తుంటే..ఆ బుడతడు క్రికెట్ బ్యాట్ పట్టాడు. కుర్రాళ్ళంతా పుస్తకాలతో కుస్తీ పట్టి పరీక్షలలో మార్కుల కోసం రాత్రింబవళ్ళు చదివేస్తుంటే.. ఆ కుర్రాడు సిక్స్ లు ఫోర్లతో స్టేడియం దద్దరిల్లేలా చేయడంలో పడిపోయాడు.

Sachin Tendulkar’s 48th Birthday: సచిన్ ను 'గాడ్ ఆఫ్ క్రికెట్' అని ఎందుకు పిలుస్తారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.. Viral Video
Tendulkar The God Of Cricket
Follow us
KVD Varma

|

Updated on: Apr 24, 2021 | 1:00 PM

Sachin Tendulkar’s 48th Birthday: అందరూ బుడి బుడి అడుగులు వేస్తుంటే..ఆ బుడతడు క్రికెట్ బ్యాట్ పట్టాడు. కుర్రాళ్ళంతా పుస్తకాలతో కుస్తీ పట్టి పరీక్షలలో మార్కుల కోసం రాత్రింబవళ్ళు చదివేస్తుంటే.. ఆ కుర్రాడు సిక్స్ లు ఫోర్లతో స్టేడియం దద్దరిల్లేలా చేయడంలో పడిపోయాడు..అందరూ నాలుగైదు మ్యాచ్ లు ఆడి.. ఫిట్ నెస్ లేదని పక్కకు జరిగితే.. బ్యాట్ పట్టుకున్నప్పటి నుంచి దానిని పక్కన పడేసే వయసు వచ్చేవరకూ ఒక్కరోజు కూడా అనారోగ్య కారణాలతో దానిని వదలలేదు. ఇదంతా ఎవరికోసం చెబుతున్నామో మీకు ఈపాటికి అర్ధం అయిపోయి ఉంటుంది. అవును.. క్రికెట్ దేవుడు అని పిలుచుకునే మన సచిన్ టెండూల్కర్ గురించే! రెండు దశాబ్దాల పైగా క్రికెట్ ఆడి.. సెంచరీల వర్షం కురిపించినా.. పరుగుల ప్రవాహంతో తన సమకాలీనుల కన్నా ఎక్కువ ఎత్తులో నిలిచినా.. ఫిట్ నెస్.. చిత్తశుద్ధి..అన్నిటికీ మించి అదే ఉత్సాహం కనబరచడం ప్రపంచంలో ఒకే ఒక్క క్రికెటర్ కు సాధ్యం అయింది. అందుకే సచిన్ ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ అని మహా మహులైన క్రికెటర్లు అందరూ ముక్తకంఠంతో కీర్తించారు సచిన్ ను. అతన్ని ‘క్రికెట్ దేవుడు’ అలాగే భారతదేశంలో డెమి-గాడ్ గా ఎందుకు పరిగణిస్తారో నిరూపించే ఒక వీడియో ఇక్కడ మీకోసం ఇస్తున్నాం. ఇది ఒక అభిమాని వీడియో, ఇది సచిన్ అభిమానులుగా మారిపోయిన అతని సహ-క్రికెటర్లు సచిన్ పాదాలను తాకిన అన్ని క్షణాలను ఒక్క దగ్గర చేసి కూర్చిన వీడియో. సచిన్ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ లో వైరల్ అవుతోంది..

ఈ వీడియోలో సచిన్ టెండూల్కర్ తనను ‘క్రికెట్ దేవుడు’ అని ఎందుకు పిలుస్తున్నారో ప్రపంచానికి చూపించారు. ఎన్నో అంతర్జాతీయ పరుగుల నుండి చాలా సెంచరీల వరకు, టెండూల్కర్ రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ ఆడాడు. ఇంత సుదీర్ఘ కాలంలో ఆ చిత్తశుద్ధి, ఫిట్‌నెస్ మరియు ఆ ఉత్సాహాన్ని కొనసాగించడం అంత సులభం కాదు, కానీ అతను దానిని చేసి చూపించాడు. అందుకే అతన్ని బ్యాట్ పట్టుకున్న ఉత్తమమైన వ్యక్తిగా పరిగణించారు. గత శతాబ్దంలో చాలా మంది బ్యాట్స్ మెన్ వచ్చారు.. వెళ్ళారు.. కానీ, సచిన్ ఎవరితోనూ పోల్చడానికి కుదరని క్రికెటర్.. ఎవరూ తమను సచిన్ తో పోల్చుకునే కనీస పరిగణన లోకి చేరలేరు. అందుకే సచిన్ క్రికెట్ దేవుడు!

గొప్ప వ్యక్తిగా కీర్తి ప్రతిష్టలు సాధించిన టెండూల్కర్ – 37 ఏళ్ళ వయసులో – 2011 లో భారతదేశంలో ప్రపంచ కప్ కిరీటాన్ని గెలుచుకున్నాడు. టోర్నమెంట్‌కు ముందు ఏమనుకున్నారంటే, ఇది టెండూల్కర్ చివరిది కావచ్చు అని. కానీ అతను తన సివిలో డబ్ల్యుసి టైటిల్ లేకుండా రిటైర్ కాలేడు. 1983 లో కపిల్ దేవ్ ఈ ఘనత సాధించిన తరువాత ఎంఎస్ ధోని నేతృత్వంలోని భారతదేశం రెండవ వరల్డ్ కప్ కిరీటం అందుకున్న ఈ టోర్నమెంట్ మొత్తంలో టెండూల్కర్ అద్భుతంగా తన ఆటతో ఆకట్టుకున్నాడు.

కొన్నేళ్లుగా, సచిన్ యువతకు, పృథ్వీ షా వంటి మంచి క్రికెటర్లకు మెంటార్డ్ చేయడమే కాకుండా, చాలా మంది క్రికెట్ ఆటవైపు వెళ్ళడానికి ప్రేరణగా నిలిచాడు. టెండూల్కర్ 2013 నవంబర్ 16 న అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన చివరి టెస్టును ఆడాడు.

Also Read: Anupama: త‌న‌ విస్కీ బేబీకి నాలుగేళ్లు నిండిన సంద‌ర్భంగా.. ఎమోష‌న‌ల్ పోస్ట్ చేసిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌..

ఎల్ఐసీ పాలసీదారులరా అలర్ట్.. ఇన్సూరెన్స్, ప్రీమియం స్టేటస్ చెక్ చేయండిలా.. మిగతా వివరాలకు SMS పంపండిలా..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.