నిర్మలకు హరీశ్ లెటర్.. మేటర్ ఏంటంటే ?

కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి  నిర్మలా సీతారామన్‌కు తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. అదీ.. అలాంటిలాంటి లేఖ కాదు.. కీలకాంశాలపై తన లేఖలో నిలదీశారు హరీశ్ రావు. ఘాటైన పదజాలం వాడారు. తెలంగాణపై చిన్న చూపు తగదని పేర్కొన్నారు. ఇంతకీ ఏ మేటర్‌లో నిర్మల సీతారామన్ తెలంగాణను చిన్న చూపు చూస్తున్నారు ? ఎందుకు హరీశ్ రావు ఘాటుగా లేఖ రాశారు ?   రీడ్ దిస్ స్టోరీ.. కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి […]

నిర్మలకు హరీశ్ లెటర్.. మేటర్ ఏంటంటే ?
Follow us

| Edited By:

Updated on: Nov 05, 2019 | 5:27 PM

కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి  నిర్మలా సీతారామన్‌కు తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. అదీ.. అలాంటిలాంటి లేఖ కాదు.. కీలకాంశాలపై తన లేఖలో నిలదీశారు హరీశ్ రావు. ఘాటైన పదజాలం వాడారు. తెలంగాణపై చిన్న చూపు తగదని పేర్కొన్నారు. ఇంతకీ ఏ మేటర్‌లో నిర్మల సీతారామన్ తెలంగాణను చిన్న చూపు చూస్తున్నారు ? ఎందుకు హరీశ్ రావు ఘాటుగా లేఖ రాశారు ?   రీడ్ దిస్ స్టోరీ..
కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో వున్నది ఆర్థిక శాఖ. కేంద్రం డైరెక్టుగా వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు వాటా వుంటుంది. కేంద్రం నుంచి వచ్చే నిధులపై ఒక అంఛనాతోనే రాష్ట్రాల బడ్జెట్లు రూపొందుతాయి. అందుకే రాష్ట్ర బడ్జెట్‌లో ప్రస్తావించే అంశాల అమలు కేంద్రం వైఖరిపై ఆధారపడి వుంటుంది. అందుకే కేంద్రం ప్రతీ మూడు నెలలకు ఒకసారి రాష్ట్రాలకు నిధులను విడుదల చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ వుంటుంది.
ఈక్రమంలో ఒక్కో రాష్ట్రం పట్ల ఒక్కో విధానం కనబరచడం కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ వ్యూహంపై కూడా ఆధారపడి వుంటుంది. కాంగ్రెస్ పరిపాలనాకాలంలో కాంగ్రేసేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలపై వివక్ష కనిపించేది. అందుకే స్వర్గీయ ఎన్టీఆర్ కాంగ్రేసేతర ముఖ్యమంత్రులను ఒక్కతాటిపైకి తెచ్చి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు అప్పట్లో.
తాజా పరిణామాల్లో కేంద్రంలో బిజెపి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉండగా.. తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం వుంది. పన్నుల విధానంలో వచ్చిన మార్పుల ఫలితంగా ఇప్పుడు జీఎస్టీ వసూళ్ళు అత్యంత కీలకమయ్యాయి. జీఎస్టీ పేరుతో కేంద్ర, రాష్ట్రాలకు భారీగా ఆదాయం పెరిగింది. అయితే.. కేంద్రం వసూలు చేసే జీఎస్టీలో రాష్ట్రాల వాటా సకాలంలో విడుదల కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సరిగ్గా ఇదే అంశంపై హరీశ్ రావు.. కేంద్ర మంత్రి  నిర్మలకు లేఖ  రాశారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 2 వేల 861 కోట్ల రూపాయల నిధులను వెంటనే రిలీజ్ చేయాలని, జాప్యం తగదని హరీశ్ రావు తన లేఖలో కేంద్ర మంత్రిని కోరారు. అయితే.. తెలంగాణ రాష్ట్రం ఇబ్బందులను తెలియచేసేందుకు హరీశ్ తన లేఖలో కాస్త ఘాటైన పదజాలం వాడడం ఆయన ఆవేదనను తెలియజేస్తోందని అంటున్నారు.

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో