జీవితాన్ని త్యాగం చేస్తున్నా..టిక్రి బోర్డర్ లో లాయర్ ఆత్మహత్య, రైతుల వాణిని ప్రధాని మోదీ వినాలంటూ సూసైడ్ నోట్
రైతుల ఆందోళనకు మద్దతుగా ఆదివారం ఓ లాయర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీ బయట శివారు లోని టిక్రి బోర్డర్ లో ఈయన విషం సేవించి అపస్మారక స్థితిలో పడి ఉండగా కనుగొన్నారు. ఈయనను పంజాబ్ లో..
రైతుల ఆందోళనకు మద్దతుగా ఆదివారం ఓ లాయర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీ బయట శివారు లోని టిక్రి బోర్డర్ లో ఈయన విషం సేవించి అపస్మారక స్థితిలో పడి ఉండగా కనుగొన్నారు. ఈయనను పంజాబ్ లోని జలాలాబాద్ కు చెందిన అమర్ జిత్ సింగ్ గా గుర్తించారు. రైతులు కొందరు ఆయనను రోహ్తక్ లోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. అన్నదాతల ఆందోళనను చూసి తాను చలించిపోయానని, వారికోసం జీవితాన్ని త్యాగం చేస్తున్నానని ఈ అడ్వొకేట్ త న సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. రైతుల వాణిని ప్రధాని మోదీ ఆలకించాలని, వివాదాస్పద రైతు చట్టాలను రద్దు చేయాలనీ అమర్ జిత్ సింగ్ కోరారు. అయితే ఈ సూసైడ్ నోట్ లో తేదీ డిసెంబరు 18 అని ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇందులోని నిజానిజాలను నిర్ధారిస్తున్నామన్నారు.
ఇటీవలే సంత్ రామ్ సింగ్ బాబా అనే సిక్కు గురువు రైతుల ఆందోళనకు మద్దతుగా తన గన్ తో తనను తాను కాల్చుకుని సూసైడ్ చేసుకున్న విషయం గమనార్హం. ఆయన కూడా రైతుల కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నానని తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు.