నాలో ఆ అసంతృప్తి లేదంటోన్న సొట్ట బుగ్గల చిన్నది.. సినీ పరిశ్రమలో విజయం ఒక్కటే ముఖ్యమని వ్యాఖ్య.
తన విషయంలో అలాంటిది లేదంటోంది నటి లావణ్య త్రిపాఠి. అగ్ర హీరోల సినిమాల్లో నటించే అవకాశం రాలేదనే ఆలోచన తనలో ఎప్పుడూ రాలేదని తేల్చి చెప్పింది. ఈ విషయమై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లావణ్య పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Lavanya Thripati about star heroes movies: సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోయిన్ల విజయాలను వారు ఏ హీరో సరసన నటిస్తున్నారన్న దానిపై లెక్క గడుతుంటారు. బడా స్టార్ల సరసన నటించే అవకాశాలు సొంతం చేసుకున్న నటీమణులకు ఆఫర్లు కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఇది ఎవరూ కాదనలేని నిజం. అయితే తన విషయంలో అలాంటిది లేదంటోంది నటి లావణ్య త్రిపాఠి. అగ్ర హీరోల సినిమాల్లో నటించే అవకాశం రాలేదనే ఆలోచన తనలో ఎప్పుడూ రాలేదని తేల్చి చెప్పింది. ఈ విషయమై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లావణ్య పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ.. కొత్తదనంతో పాటు మంచి పాత్ర చేశాననే అనుభూతి ప్రతి సినిమాలో ఉండాలని చెప్పింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అంకితభావంతో పాత్రకు న్యాయం చేయడానికి కృషి చేస్తానని, అదే తన విజయ రహస్యమని తెలిపిందీ బ్యూటీ. ఇక సమయానికి తగినట్లు సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్స్ మారుతుంటాయని, కానీ తానేప్పుడూ ట్రెండ్ ఫాలో అవనని తేల్చి చెప్పింది. అగ్ర హీరోల సినిమాల్లో నటించే అవకాశం రాలేదనే ఆలోచన తనలో ఎప్పుడూ లేదని.. సినీ పరిశ్రమలో విజయమే ముఖ్యం. బడా హీరోలతో సినిమాలు చేయలేకపోయినా నా సినీ కెరీర్‌లో ఎన్నో మంచి విజయాలున్నాయని’ చెప్పుకొచ్చిందీ సొట్ట బుగ్గల చిన్నది.