వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి ఇడుపులపాయలో సీఎం జగన్ ఘననివాళి, కుటుంబసమేతంగా ప్రత్యేక ప్రార్థనలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఆయన తనయుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఆయన తనయుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ దగ్గరకు కుటుంబసమేతంగా చేరుకున్న జగన్ వైఎస్ సమాధిపై పుష్పగుజ్జం ఉంచి నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇడుపులపాయలోని చర్చిలో కుటుంబసభ్యులతో కలిసి జగన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.