Kim Jong Un Warns Biden: అణ్వాయుధాలు రెట్టింపు చేస్తామంటూ ప్రపంచాన్ని ఉల్కిపడేలా చేస్తున్న ఆధునిక నియంత

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మళ్ళీ లైన్ లోకి వచ్చారు. గత కొంతకాలంగా తన ఆరోగ్యంపై వచ్చిన వార్తలకు చెక్ పెడుతూ రోజుకో సంచనల వ్యాఖ్యలు చేస్తూ ప్రపంచాన్ని ఉల్కిపడేలా చేస్తున్నారు ఈ ఆధునిక నియంత...

Kim Jong Un Warns Biden: అణ్వాయుధాలు రెట్టింపు చేస్తామంటూ ప్రపంచాన్ని ఉల్కిపడేలా చేస్తున్న ఆధునిక నియంత
Follow us

|

Updated on: Jan 15, 2021 | 4:08 PM

Kim Jong Un Warns Biden:ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మళ్ళీ లైన్ లోకి వచ్చారు. గత కొంతకాలంగా తన ఆరోగ్యంపై వచ్చిన వార్తలకు చెక్ పెడుతూ రోజుకో సంచనల వ్యాఖ్యలు చేస్తూ ప్రపంచాన్ని ఉల్కిపడేలా చేస్తున్నారు ఈ ఆధునిక నియంత. అమెరికా అధ్యక్షుడుగా జో పదవి చేపట్టనున్న తరుణంలో కిమ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో జరుగుతున్న అధికార వర్కర్స్ పార్టీ మహాసభ ముగింపు సమావేశంలో కిమ్‌జొంగ్ ప్రసంగించారు. ఈ మహాసభలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో కిమ్ తొలిసారిగా నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. అణ్వస్త్ర సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోవడానికి అవసరమైన ఆదేశాలను తక్షణమే జారీ చేస్తానని చెప్పారు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత.. అణ్వాయుధ శక్తిని పెంపొందించుకోవడంపై ప్రాధాన్యత ఇచ్చానని, అదే విధానాన్ని కొనసాగిస్తానని చెప్పారు.

ఓవైపు అమెరికా విధించిన ఆంక్షలతో పాటు మరోవైపు కరోనా విజృంభణ ఆర్ధిక వ్యవస్ధపై ప్రభావం చూపాయన్నారు. కొత్త అధ్యక్షుడు జో బిడెన్ పేరును ప్రస్తావించకుండా అమెరికా ప్రభుత్వం గురించి ప్రస్తావించారు. అక్కడ ప్రభుత్వం మారబోతోందని, కొత్త ప్రభుత్వం తమ దేశంపై ఎటువంటి వైఖరిని అనుసరిస్తుందనే విషయం కొరియన్లలో ఆసక్తి కలిగిస్తోందని కిమ్‌జొంగ్ వ్యాఖ్యానించారు. మరోవైపు దక్షిణ కొరియాపై నిప్పులు చెరిగారు. తమదేశంలో ఎలాంటి సైనిక కార్యక్రమాలను చేపట్టనప్పటికీ.. పొరుగు దేశం ఎందుకు ఉలిక్కిపడుతోందని ఎద్దేవా చేశారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ.. అంచనాలకు అనుగుణంగా పాలన సాగుతోందని అన్నారు. ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడానికి, మళ్లీ పూర్వపు స్థితికి తీసుకుని రావడానికి తక్షణ చర్యలను సూచించాల్సిందిగా పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు.

Also Read: రూ.20 వాటర్ బాటిల్‌కు రూ.164 బిల్ వేసిన రెస్టారెంట్, ఐదేళ్లు పోరాటం గెలిచిన రోహిత్