‘పహిల్వాన్’ – టైటిల్ అదిరినా.. పట్టులేని కుస్తీ!
టైటిల్ : ‘పహిల్వాన్’ తారాగణం : సుదీప్, ఆకాంక్ష సింగ్, సునీల్ శెట్టి, సుశాంత్ సింగ్, కబీర్ దుహన్ సింగ్, అవినాష్ తదితరులు సంగీతం : అర్జున్ జన్యా నిర్మాతలు : స్వప్నకృష్ణ స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఎస్.కృష్ణ విడుదల తేదీ: 12-09-2019 కన్నడ స్టార్ హీరో సుదీప్ నటించిన తాజా చిత్రం ‘పహిల్వాన్’. రాజమౌళి ‘ఈగ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సుదీప్‌కు ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా తెలుగులో […]

టైటిల్ : ‘పహిల్వాన్’
తారాగణం : సుదీప్, ఆకాంక్ష సింగ్, సునీల్ శెట్టి, సుశాంత్ సింగ్, కబీర్ దుహన్ సింగ్, అవినాష్ తదితరులు
సంగీతం : అర్జున్ జన్యా
నిర్మాతలు : స్వప్నకృష్ణ
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఎస్.కృష్ణ
విడుదల తేదీ: 12-09-2019
కన్నడ స్టార్ హీరో సుదీప్ నటించిన తాజా చిత్రం ‘పహిల్వాన్’. రాజమౌళి ‘ఈగ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సుదీప్‌కు ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా తెలుగులో హిట్టయిన ‘విక్రమార్కుడు’, ‘అత్తారింటికి దారేది’ ‘మిర్చి’ సినిమాలను కన్నడంలో రీమేక్ చేసి మాస్ ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. ఇప్పుడు తాజాగా ‘పహిల్వాన్’తో అటు కన్నడ.. ఇటు తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. మరి ఈ సినిమా ఫ్యాన్స్‌ను ఏమేరకు మెప్పించగలిగిందో ఈ సమీక్షలో చూద్దాం.?
కథ :
కృష్ణ(సుదీప్) ఓ అనాథ. అతన్ని శంకర్(సునీల్ శెట్టి) అనే ఓ కుస్తీ యోధుడు చేరదీస్తాడు. చిన్నప్పటి నుంచి శంకర్‌ను గురువుగా భావించే కృష్ణ.. అతని దగ్గరే కుస్తీలో మెళకువలు నేర్చుకుని.. పెద్ద వస్తాదులా మారతాడు. అనుకోని విధంగా ఓ అమ్మాయి(ఆకాంక్ష సింగ్) కృష్ణ జీవితంలోకి రావడంతో కుస్తీని క్రమంగా నిర్లక్ష్యం చేస్తుంటాడు. కృష్ణ ప్రవర్తనను చూసిన గురువు శంకర్ కోపంతో ‘నా నుంచి నేర్చుకున్న ఈ కుస్తీని నువ్వు ఎప్పుడూ ఎక్కడా ప్రదర్శించకూడదని వాగ్దానం తీసుకుంటాడు’. ఇక గురువు ఆజ్ఞ మేరకు కృష్ణ అన్నింటిని వదిలేసి దూరంగా వెళ్ళిపోతాడు. అలాంటి కృష్ణ బాక్సింగ్ ఛాంపియన్ ఎలా అయ్యాడు..? ఈ క్రమంలో గురువు శంకర్, కృష్ణకు సహాయం అందించాడా.? అనే ప్రశ్నలకు సమాధానం వెండి తెరపై చూడాల్సిందే.
నటీనటుల అభినయం:
‘పహిల్వాన్’కు ముఖ్యంగా హీరో సుదీపే బలం. కృష్ణ అనే కుస్తీ యోధుడి పాత్రలో సుదీప్ తన మార్క్ నటనతో ప్రేక్షకులకు రక్తికట్టించాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో ఈజ్‌తో నటించాడు. శంకర్ పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి జీవించాడని చెప్పవచ్చు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే ఆకాంక్ష సింగ్ అటు గ్లామర్ పరంగా, ఇటు నటనలోనూ మంచి మార్కులే సంపాదించింది. కబీర్ విలనిజం రొటీన్‌గా సాగిపోయింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
విశ్లేషణ :
కన్నడిగులకు ఈ సినిమా నచ్చుతుందేమో గానీ.. తెలుగు ప్రేక్షకులు మాత్రం అంతగా కనెక్ట్ కాలేరు. రొటీన్ కథ, కథనం.. అంతేకాకుండా కొన్ని వర్గాల వారికే నచ్చే అంశాలు ‘పహిల్వాన్’లో కనిపిస్తాయి. తండ్రీ-కూతుళ్ల ఎపిసోడ్ ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చేదే. కాకపోతే దాని నిడివి మరీ ఎక్కువై విసిగించింది. పతాక సన్నివేశాలన్నీ బాక్సింగ్ నేపథ్యంలో సాగేవే. హీరో ఈ పోరులో గెలుస్తాడని ఎలాగూ ప్రేక్షకులు ఊహిస్తారు. ఓవరాల్‌గా భారీ హంగులతో వచ్చిన పహిల్వాన్ ఓ రొటీన్ స్పోర్ట్స్ డ్రామాగా నిలిచిపోవాల్సి వచ్చింది.
సాంకేతిక విభాగాల పనితీరు:
నేపధ్య సంగీతం చిత్రానికి ప్రధాన బలం. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా కలిసొచ్చింది. కెమెరా పనితనం బాగుంది. సాంకేతికంగా సినిమాను ఉన్నత స్థాయిలోనే తీర్చిదిద్దారు. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
- సుదీప్
- యాక్షన్ సన్నివేశాలు
- సాంకేతిక విలువలు
మైనస్ పాయింట్స్ :
- రొటీన్ కథా, కథనం