తెరుచుకున్న శబరిమల ఆలయం, నేటి నుంచే భక్తులకు అనుమతి, మార్గదర్శకాలివే

వార్షిక మండల మకరవిళక్కు పూజకోసం శబరిమల ఆలయం ఆదివారం తెరుచుకుంది.  కరోనా నేపథ్యంలో కఠిన ఆంక్షల మధ్య శబరిమల ఆలయంలోకి సోమవారం నుంచి భక్తులను అనుమతిస్తున్నారు.

తెరుచుకున్న శబరిమల ఆలయం, నేటి నుంచే భక్తులకు అనుమతి, మార్గదర్శకాలివే
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 16, 2020 | 7:27 AM

వార్షిక మండల మకరవిళక్కు పూజకోసం శబరిమల ఆలయం ఆదివారం తెరుచుకుంది.  కరోనా నేపథ్యంలో కఠిన ఆంక్షల మధ్య శబరిమల ఆలయంలోకి సోమవారం నుంచి భక్తులను అనుమతిస్తున్నారు. కొవిడ్​-19 మార్గదర్శకాలు పాటిస్తూ.. కఠిన ఆంక్షల మధ్య రోజుకు 1000 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. వారాంతాల్లో 2వేల మందిని అయ్యప్పస్వామి దర్శనానికి అనుమతించనున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. డిసెంబర్​ 26 వరకు ఆలయాన్ని తెరిచే ఉంచనున్నారు. ఈ క్రమంలో ఆలయ ప్రధాన పూజరి ఏకే సుధీర్ నంబూత్రి గర్భగుడి తలుపులు తెరిచి దీపాలు వెలిగించారు.

భక్తులందరికీ కరోనా టెస్టు నిర్వహించనుండగా 60ఏళ్లు పైబడిన, పదేళ్లలోపు పిల్లలకు అనుమతి లేదు. దగ్గు, జలుబు ఉన్నవారు, ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్నవారు కూడా దర్శనానికి రావొద్దని శబరిమల ఆలయ మండలి సూచించింది.

మార్గదర్శకాలివే..

  • అయ్యప్ప దర్శనం చేసుకోవాలనుకున్న భక్తులు ముందుగానే కేరళ పోలీస్‌శాఖ అభివృద్ధి చేసిన వర్చువల్‌ క్యూ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. దీని కోసం “https://sabarimalaonline.org” వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • రోజుకు గరిష్ఠంగా 1,000 మంది భక్తులకు అనుమతి ఇస్తారు. వారాంతాల్లో 2000 మందికి దర్శన భాగ్యం కలిపిస్తారు.
  • శబరిమలకు వచ్చే భక్తులంతా 24 గంటల ముందు కరోనా టెస్టులు చేయించుకోవాలి. వైద్య ఫలితాల్లో నెగటివ్​ వచ్చిన వారికే దర్శనానికి అనుమతి.
  • రాకపోకల సమయాల్లోనూ భక్తులు కచ్చితంగా భౌతిక దూరం పాటించాల్సిందే. ప్రతి 30 నిమిషాలకు శానిటైజర్​తో చేతులు శుభ్రం చేసుకోవాలి.
  • మాస్కులు తప్పనిసరిగా దరించాలి.
  • స్వామికి నెయ్యి అభిషేకాలు, పంపా నదిలో స్నానాలు సహా సన్నిధానంలో రాత్రి బసచేయడం వంటివాటిని అనుమతించరు.
  • ప్రవేశమార్గంలోనూ యాంటీజెన్‌  టెస్టులు నిర్వహిస్తారు. వాటిల్లోనూ నెగెటివ్​ వస్తేనే దర్శనానికి అనుమతిస్తారు
  • ఈ మధ్యకాలంలో కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తులు ఉంటే వారికి ఫిట్​నెస్​ టెస్టు చేస్తారు. వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి, లక్షణాలు లేకుండా ఫిట్​గా ఉన్నారని కన్ఫామ్ చేశాకే ఆలయంలోకి అనుమతి ఇస్తారు.
  • 60-65 సంవత్సరాలు దాటిన వారిని, పది సంవత్సరాలలోపు వారిని  దర్శనానికి అనుమతించరు. దీర్ఘకాలిక, గుండె సమస్యలతో బాధపడుతున్న వారు శబరిమల యాత్రకు రాకూడదని ఆలయ అధికారులు కోరారు.
  • యాత్రకు వచ్చిన వాళ్లు తమతో ఆయుష్మాన్‌ భారత్‌, బీపీఎల్‌ తదితర ఆరోగ్యబీమా కార్డులను వెంటతెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులకు కోవిడ్ సోకితే.. వారి కోసం చికిత్స కోసం సదుపాయాలు కల్పిస్తున్నారు.

Also Read : పరమ పవిత్ర కార్తీక మాసం ప్రారంభం, నేడు బెజవాడ దుర్గమ్మకు గాజులతో విశేష అలంకరణ

ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్