కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఇస్తానంటూ పిలిచి లైంగికదాడి.. కేరళలో వైద్య సిబ్బంది అరెస్ట్

కేరళలో దారుణం జరిగింది. కరోనా సోకిన యువతిపై ఓ జూనియర్ వైద్య సిబ్బంది అఘాయిత్యానికి పాల్పడ్డాడు. క్వారంటైన్‌లో ఉన్న మహిళపై లైంగికదాడి చేసిన జూనియర్ హెల్త్ ఇన్స్‌స్పెక్టర్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు.

కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఇస్తానంటూ పిలిచి లైంగికదాడి.. కేరళలో వైద్య సిబ్బంది అరెస్ట్
Follow us

|

Updated on: Sep 07, 2020 | 5:56 PM

కేరళలో దారుణం జరిగింది. కరోనా సోకిన యువతిపై ఓ జూనియర్ వైద్య సిబ్బంది అఘాయిత్యానికి పాల్పడ్డాడు. క్వారంటైన్‌లో ఉన్న మహిళపై లైంగికదాడి చేసిన జూనియర్ హెల్త్ ఇన్స్‌స్పెక్టర్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువనంతపురానికి చెందిన ఒక మహిళకు కరోనా పాటిజివ్‌గా రావడంతో క్వారంటైన్ కేంద్రంలో చికిత్స కోసం వచ్చింది. కొద్ది రోజుల తర్వాత ఆమెకు కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ ఫలితం వచ్చింది. అయితే, కరోనా నుంచి కోలుకున్న ఆమె ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది. కాగా, కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ఇస్తానంటూ జూనియర్ హెల్త్ ఇన్స్‌స్పెక్టర్‌ ఆమెను తన ఇంటికి పిలిపించుకున్నాడు. తన ఇంటికి వచ్చిన ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అతడ్ని సోమవారం అరెస్ట్ చేశారు.

మరోవైపు, కేరళలో జరిగిన మరో ఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పఠనంథిట్టలో కరోనా పాజిటివ్ మహిళపై అంబులెన్స్ డ్రైవర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో కేరళలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి బాధ్యత వహించి ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజా తన పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష బీజేపీ మహిళా మోర్చా సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా వరుస ఘటనలు జరగుతుండడం పట్ల ప్రభుత్వ బాధ్యత వహించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.