AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bird Flu In Kerala: కేరళలో విజృంభిస్తోన్న బర్డ్‌ ఫ్లూ… రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం..

Kerala High high alert on Bird Flu: కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ వచ్చేస్తోంది ఇక అంతా మంచే జరుగుతోందని అనుకుంటోన్న సమయంలో మరో వైరస్‌ మహమ్మారి ముంచుకొస్తుంది...

Bird Flu In Kerala: కేరళలో విజృంభిస్తోన్న బర్డ్‌ ఫ్లూ... రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం..
Narender Vaitla
| Edited By: |

Updated on: Jan 05, 2021 | 1:26 PM

Share

Kerala High High Alert On Bird Flu : కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ వచ్చేస్తోంది ఇక అంతా మంచే జరుగుతోందని అనుకుంటోన్న సమయంలో మరో వైరస్‌ మహమ్మారి ముంచుకొస్తుంది. గత కొన్ని రోజులుగా జరగుతోన్న పరిమాణాలు చూస్తుంటే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏవియన్‌ ఇన్‌ఫ్లూయాంజాతో (బర్డ్‌ ఫ్లూ) ఇప్పటికే చాలా పక్షులు మృత్యువాతపడ్డాయి. ఇక రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమచల్‌ ప్రదేశ్‌లో తీవ్ర కలకలం సృష్టిస్తోన్న ఈ బర్డ్‌ఫ్లూ తాజాగా దక్షిణాదిలోనూ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా కేరళలోని కొట్టాయం, అలప్పుజా జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీంతో వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఆయా జిల్లాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. అయితే ఈ వ్యాధి ఇప్పటి వరకు పక్షుల నుంచి మనుషులకు సోకలేదని అధికారులు స్పష్టం చేశారు. మరణించిన బాతుల్లో తొలిసారి ఈ వ్యాధిని గుర్తించినట్లు తెలిపారు. కొట్టాయంలో ఓ రైతు వద్ద ఉన్న 8వేల బాతుల్లో ఈ వైరస్‌ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఇప్పటి వరకు పక్షుల నుంచి మనుషులకు వైరస్‌ వ్యాపించిన దాఖలాలు లేకపోయినప్పటికీ.. వైరస్‌ మనుషులకూ సంక్రమించే అవకాశాలు లేకపోలేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో పక్షి మరణాలు సంభవించిన ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు జారీ చేశారు. బర్డ్‌ ఫ్లూ కేసులు నమోదైన ప్రాంతాల్లో ఒక కిలోమీటర్‌ రేడియస్‌ పరిధిలో పౌల్ట్రీలను తొలగించే పనిలో పడ్డారు.

Also Read:

Bird Flu In India: చికెన్‌, గుడ్లపై నిషేధం.. అప్రమత్తంగా ఉండాలని సూచించిన ప్రభుత్వం.

Bandi Sanjay: రాబోయే మూడేళ్లు కేసీఆరే ముఖ్యమంత్రి… వరంగల్ పర్యటనలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్….