కేరళ గవర్నర్‌కు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి ఉగ్రరూపం చూపిస్తున్నట్లు కనిపిస్తుంది.

కేరళ గవర్నర్‌కు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 07, 2020 | 9:29 PM

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి ఉగ్రరూపం చూపిస్తున్నట్లు కనిపిస్తుంది. గతకొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టిన పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. మరోవైపు, వైరస్ బారినపడుతున్న ప్రముఖుల జాబితా కూడా రెట్టింపు అవుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేరళ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు చెప్పారు. గత వారం న్యూఢిల్లీలో తనతో సన్నిహితంగా ఉన్నవారందరినీ కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఈ మేరకు ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.