కరోనాపై కేరళ విజయం..మొదటి బాధితురాలికి నెగటీవ్ రిపోర్ట్…

కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఆసుపత్రిలో చేరిన భారతదేశపు మొదటి కరోనా వైరస్ రోగి యొక్క తాజా పరీక్షా ఫలితాలు ఆమె కోలుకుంటున్నట్లు సూచిస్తున్నాయి. జనవరి 30 న తేదీన వుహాన్ నుంచి భారత వైద్య విద్యార్థికి పరీక్ష చేయగా కరోనా పాజిటీవ్‌గా వచ్చినట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. అయితే తాజాగా పంపిన 5 వ శాంపిల్ రిపోర్ట్ మాత్రం నెగటీవ్‌గా వచ్చింది.  ఫిబ్రవరి 8 న పరీక్ష కోసం పంపిన మరో శాంపిల్  ఫలితాలు ఇంకా రాలేదు. […]

కరోనాపై కేరళ విజయం..మొదటి బాధితురాలికి నెగటీవ్ రిపోర్ట్...
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 10, 2020 | 8:14 PM

కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఆసుపత్రిలో చేరిన భారతదేశపు మొదటి కరోనా వైరస్ రోగి యొక్క తాజా పరీక్షా ఫలితాలు ఆమె కోలుకుంటున్నట్లు సూచిస్తున్నాయి. జనవరి 30 న తేదీన వుహాన్ నుంచి భారత వైద్య విద్యార్థికి పరీక్ష చేయగా కరోనా పాజిటీవ్‌గా వచ్చినట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. అయితే తాజాగా పంపిన 5 వ శాంపిల్ రిపోర్ట్ మాత్రం నెగటీవ్‌గా వచ్చింది.  ఫిబ్రవరి 8 న పరీక్ష కోసం పంపిన మరో శాంపిల్  ఫలితాలు ఇంకా రాలేదు. అది కూడా ప్రతికూలంగా వచ్చినట్లయితే.. ప్రస్తుతం త్రిస్సూర్ జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఉన్న కరోనా బాధితురాలు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవ్వడానికి అనుమతి ఉంటుంది. 

కాగా  రాష్ట్రంలో ఇంకా 3 వేల మందికి పైగా కరోనా వైరస్ సోకినట్లు అనుమానం ఉన్నవారిని అబ్జర్వేషన్‌లో ఉంచినట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది.  పరిశీలనలో ఉన్న 3,144 మందిలో.. 3,099 మంది ఇంటి వద్ద 45 మందిని ఆసుపత్రులలో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి కె.కె. శైలజ అన్నారు.

“ఇప్పటివరకు, 330 నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపాం. వాటిలో 288 మందికి నెగటీవ్ రిపోర్ట్ వచ్చింది. మిగిలిన ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాము” అని మంత్రి విలేకరులతో అన్నారు.  గత కొన్ని రోజులుగా వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్టుగా తేలకపోవడంతో కేరళ ప్రభుత్వం శుక్రవారం ‘రాష్ట్ర విపత్తు’ హెచ్చరికను ఉపసంహరించుకుంది.