క్రేజీ క్రేజీగా.. కేజ్రీవాల్ విజయానికి కారణం అదేనా..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై జమ్మూకశ్మీర్‌ బీజేపీ అధ్యక్షుడు రవీందర్‌ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ చలిసా పఠించడం వల్లే ఆప్ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిందని చెప్పారు. “హనుమాన్ జీ కారణంగా కేజ్రీవాల్ గెలిచాడు, హనుమంతుడు ఆశీర్వదించాడు, లేకపోతే అతను గెలవలేడు” అని రైనా పేర్కొన్నారు. అలాగే తమ పార్టీ ఓట్ల శాతం కూడా చాలా రెట్లు పెరిగిందని అన్నారు. […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:55 am, Wed, 12 February 20
క్రేజీ క్రేజీగా.. కేజ్రీవాల్ విజయానికి కారణం అదేనా..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై జమ్మూకశ్మీర్‌ బీజేపీ అధ్యక్షుడు రవీందర్‌ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ చలిసా పఠించడం వల్లే ఆప్ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిందని చెప్పారు. “హనుమాన్ జీ కారణంగా కేజ్రీవాల్ గెలిచాడు, హనుమంతుడు ఆశీర్వదించాడు, లేకపోతే అతను గెలవలేడు” అని రైనా పేర్కొన్నారు.

అలాగే తమ పార్టీ ఓట్ల శాతం కూడా చాలా రెట్లు పెరిగిందని అన్నారు. ‘జై శ్రీ రామ్’ అని నినాదాలు చేసినప్పటికీ బీజేపీ ఎందుకు గెలవలేదని అడిగిన ప్రశ్నకు, లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు రామ నామాన్ని పదేపదే జపించడం వల్లే.. పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ అత్యధిక మెజారిటీతో గెలిచిందని రవీందర్‌ స్పష్టంచేశారు. మరోవైపు ఢిల్లీలో ఆప్‌ కార్యకర్తల విజయ సంబరాలు అంబరాన్నంటాయి. ఎగ్జిబిషన్‌ మైదానం బయట రోడ్లపై మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు.