పదహారణాల పడుచు అమ్మాయి.. ప్రీ-లుక్‌లో ఎవరీమె?

పదహారణాల పడుచు అమ్మాయి.. ప్రీ-లుక్‌లో ఎవరీమె?

‘మహానటి’ చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. ప్రస్తుతం ఆమె నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తోంది. ఇవాళ కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా చిత్రం యూనిట్ ప్రీ-లుక్‌ను విడుదల చేశారు.  ఎంతో సింపుల్‌గా చుడిదార్‌లో కీర్తి చిరునవ్వు నవ్వుతూ ఉంది. చూస్తుంటే చుట్టూ ఉన్న ఇల్లు కూడా ఏదో పాతకాలం ఇంటి మాదిరిగా కనిపిస్తోంది. ఇక కీర్తి సురేష్ అంటేనే మనకు బొద్దుగా ఉండే రూపం గుర్తొస్తుంది. కానీ ఈ […]

Ravi Kiran

|

Oct 17, 2019 | 3:42 PM

‘మహానటి’ చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. ప్రస్తుతం ఆమె నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తోంది. ఇవాళ కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా చిత్రం యూనిట్ ప్రీ-లుక్‌ను విడుదల చేశారు.  ఎంతో సింపుల్‌గా చుడిదార్‌లో కీర్తి చిరునవ్వు నవ్వుతూ ఉంది. చూస్తుంటే చుట్టూ ఉన్న ఇల్లు కూడా ఏదో పాతకాలం ఇంటి మాదిరిగా కనిపిస్తోంది. ఇక కీర్తి సురేష్ అంటేనే మనకు బొద్దుగా ఉండే రూపం గుర్తొస్తుంది. కానీ ఈ పోస్టర్‌లో ఆమె పూర్తిగా జీరో సైజులో కనిపిస్తోంది. అయితే ప్రేక్షకులకు మాత్రం కీర్తి బొద్దుగా ఉంటేనే బాగుంటుందని అంటున్నారు.

ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర నిర్మిస్తున్నారు.  దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. దీపావళి నాడు ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల కానుంది. మరోవైపు కీర్తి ‘పెంగ్విన్’ అనే లేడి ఓరియెంటెడ్ సినిమాలో కూడా నటిస్తోంది. కాగా, మహానటి కీర్తి సురేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది టీవీ9 తెలుగు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu