కొండపోచమ్మ సాగర్ పర్యటనకు సీఎం కేసీఆర్..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. గోదావరి జలాలను తెలంగాణలోని ప్రతి పల్లెకి చేరాలన్న ధృఢసంకల్పంతో సాగుతున్న పనులు తుది దశకు చేరుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మర్కూక్‌ పంప్‌హౌసే చివరిది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. నాలుగైదు రోజుల్లో ఈ పర్యటన ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌కు చేర్చడం ద్వారా గోదావరి నీటిని అత్యధిక ఎత్తుకు తీసుకెళ్లినట్టవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మర్కూక్‌ […]

కొండపోచమ్మ సాగర్ పర్యటనకు సీఎం కేసీఆర్..!
Follow us

|

Updated on: May 25, 2020 | 3:20 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. గోదావరి జలాలను తెలంగాణలోని ప్రతి పల్లెకి చేరాలన్న ధృఢసంకల్పంతో సాగుతున్న పనులు తుది దశకు చేరుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మర్కూక్‌ పంప్‌హౌసే చివరిది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. నాలుగైదు రోజుల్లో ఈ పర్యటన ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌కు చేర్చడం ద్వారా గోదావరి నీటిని అత్యధిక ఎత్తుకు తీసుకెళ్లినట్టవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మర్కూక్‌ పంప్‌హౌ్‌సలో మోటార్లను ప్రారంభించాలని సీఎం నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ వద్ద మొదటి పంప్‌హౌ్‌స నుంచి సుమారు 88 మీటర్ల నుంచి నీటిని ఇప్పటికే ఎత్తిపోయడం మొదలైంది. ఇక్కడి నుంచి అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి, ఆ తర్వాత మల్లన్నసాగర్‌ వరకూ నీటిని తీసుకొచ్చారు. ఈ మధ్యే అక్కారం మోటార్లను మంత్రి హరీష్ రావు ప్రారంభించి మర్కూక్‌ పంప్‌హౌస్ కు నీటిని చేర్చారు. మర్కూక్‌లో మోటార్లను ప్రారంభించడం ద్వారా నేరుగా కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి నీరు చేరనుంది. దీని ఫుల్‌ రిజర్వాయర్‌ లెవల్‌ 618 మీటర్లు. అంటే.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 88 మీటర్ల నుంచి 618 మీటర్ల ఎగువకు నీటిని తీసుకురానున్నారు. మొత్తంగా చూస్తే 530 మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్‌ చేయనున్నారు. కొండపోచమ్మకు చేరిన నీరు గ్రావిటీ ద్వారా పలు ప్రాంతాలకు వెళ్లనుంది. దీంతో అత్యధిక ఎత్తు వరకు రివర్స్ పంపింగ్ ద్వారా గోదావరి జలాలను అందించిన ఘనత కాళేశ్వరం ప్రాజెక్టుకు దక్కుతుంది.