రాజకీయ కక్షతోనే నాపై కేసులు: టీవీ9తో కత్తి కార్తీక

రాజకీయ కక్షతోనే నాపై కేసులు నమోదు అవుతున్నాయని దుబ్బాక ఉపఎన్నికలో పోటీచేస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థి కత్తి కార్తీక టీవీ9తో చెప్పారు. అమిన్ పూర్ ల్యాండ్ ఇష్యూలో తాను ఎవరిని మోసం చేయలేదని ఆమె స్పష్టం చేశారు. “సదరు వ్యక్తికి రెండు నెలల క్రితమే లీగల్ నోటీసులు పంపించాను.. మరి ఇప్పుడు పోలీసులు నాపై కేసు ఎలా నమోదు చేస్తారు..” అని కార్తీక ప్రశ్నించింది. తన పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్టు తనకు సమాచారం […]

రాజకీయ కక్షతోనే నాపై కేసులు:  టీవీ9తో కత్తి కార్తీక
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 17, 2020 | 11:28 AM

రాజకీయ కక్షతోనే నాపై కేసులు నమోదు అవుతున్నాయని దుబ్బాక ఉపఎన్నికలో పోటీచేస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థి కత్తి కార్తీక టీవీ9తో చెప్పారు. అమిన్ పూర్ ల్యాండ్ ఇష్యూలో తాను ఎవరిని మోసం చేయలేదని ఆమె స్పష్టం చేశారు. “సదరు వ్యక్తికి రెండు నెలల క్రితమే లీగల్ నోటీసులు పంపించాను.. మరి ఇప్పుడు పోలీసులు నాపై కేసు ఎలా నమోదు చేస్తారు..” అని కార్తీక ప్రశ్నించింది. తన పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్టు తనకు సమాచారం లేదని.. మీడియా ద్వారానే తనకు తెలిసిందని కార్తీక తెలిపింది. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాను రాజకీయాలను వీడనని.. 2023 లో కూడా దుబ్బాక నుండే పోటీ చేస్తానని కార్తీక తేల్చి చెప్పింది. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో చాలా వెనుకబడిందని, అభివృద్ధి పర్చాల్సిన ఆవస్యకత చాలా ఉందని ఆమె పేర్కొంది.  కత్తి కార్తీక పై చీటింగ్ కేసు